కాంగ్రెస్, బీజేపీలకు గట్టి ఝలక్కే ఇచ్చారు | TRS cheers ,bjp, congress in Shock | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలకు గట్టి ఝలక్కే ఇచ్చారు

Sep 16 2014 2:00 PM | Updated on Mar 29 2019 9:24 PM

కాంగ్రెస్, బీజేపీలకు గట్టి ఝలక్కే ఇచ్చారు - Sakshi

కాంగ్రెస్, బీజేపీలకు గట్టి ఝలక్కే ఇచ్చారు

తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్లు గట్టి ఝలక్కే ఇచ్చారు.

మెదక్ : తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్లు గట్టి ఝలక్కే ఇచ్చారు. తాము ఇంకా కారు దిగి రాలేదని ఓటు ద్వారా స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి 2 లక్షల 10 వేల 523 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి లక్షా 86వేల 334 ఓట్లు పోలయ్యాయి. ఘోరంగా ఓటిపోయినా డిపాజిట్లు దక్కడంతో ఇద్దరు నేతలూ ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు మెదక్ లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. 3 లక్షల 61 వేల 277 ఓట్లతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌కు మొత్తం 5లక్షల 71వేల 800 ఓట్లతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  3 లక్షల 97 వేల,029 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement