ఘనంగా జగ్జీవన్‌ జయంతి | Tribute To Babu Jagjivanram | Sakshi
Sakshi News home page

ఘనంగా జగ్జీవన్‌ జయంతి

Apr 6 2019 11:26 AM | Updated on Apr 6 2019 11:43 AM

Tribute To Babu Jagjivanram - Sakshi

నివాళులర్పిస్తున్న మోచీ సంఘం నాయకులు 

సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్‌): మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ 112వ జయంతి ఉత్సవాలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పలు పార్టీలు, సంఘాలు జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు.


బీసీ సంఘం ఆధ్వర్యంలో..
బీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని  బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యనారాయణ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్‌ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరు ముందుకు వెళ్లాలన్నారు. సంఘం నాయకులు అన్నదానం జగదీశ్వర్, నర్సోజి, సామల ప్రశాంత్‌ పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో..
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌ రామ్‌ చౌరస్తాకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇందులో మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుర్గం శేఖర్, యువజన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్, నాహిద్‌లు పాల్గొన్నారు.


మోచీ సంఘం ఆధ్వర్యంలో..
మోచీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంపు కార్యాలయ సమీపంలోని బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌ రామ్‌ని కొనియాడారు. మోచీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల శంకర్‌కృష్ణ, జిల్లా అధ్యక్షుడు సాయన్న, కోశాధికారి గణేశ్, పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement