ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు | Traffic restrictions on Tank Bund | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌పై ‘మిలియన్‌ మార్చ్‌’ ట్రాఫిక్‌ ఆంక్షలు

Mar 10 2018 7:19 AM | Updated on Mar 10 2018 1:16 PM

Traffic restrictions on Tank Bund - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘మిలియన్‌ మార్చ్‌’ పిలుపు నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇవి అమలులో ఉంటాయని పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను పూర్తిగా నిషేధించారు.  
♦ సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మైదాన్‌ దాటి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్‌ క్లబ్‌–కవాడిగూడ–డీబీఆర్‌ మిల్స్‌–కట్టమైసమ్మ–అంబేడ్కర్‌ విగ్రహం–తెలుగుతల్లి–రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు.
♦ నెక్లెస్‌ రోటరీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా వచ్చే వాహనాలను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదికి అనుమతించరు. వీటిని గగన్‌మహల్‌–ఇందిరాపార్క్‌ మీదుగా పంపిస్తారు.
♦ నిరంకారి, పాత సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్, ఇక్బాల్‌ మీనార్‌ మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను మింట్‌ కాంపౌండ్‌/సెక్రటేరియేట్‌–ఎన్టీఆర్‌ మార్గ్‌–నెక్లెస్‌ రోటరీ–సంజీవయ్య పార్క్‌–నల్లగుట్ట–సికింద్రాబాద్‌ మీదుగా మళ్లిస్తారు.  
♦ లిబర్టీ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీఆర్‌కే భవన్‌–తెలుగుతల్లి –నెక్లెస్‌ రోటరీ–వీవీ స్టాట్యూ లేదా నెక్లెస్‌ రోడ్‌–సంజీవయ్యపార్క్‌–సికింద్రాబాద్‌ మీదుగా పంపిస్తారు.
♦ బషీర్‌బాగ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను మోర్‌ మెడికల్‌ హాల్‌–బాలాజీ గ్రాండ్‌ బజార్‌–క్రిస్టల్‌–తెలుగుతల్లి–ఇక్బాల్‌ మీనార్‌ మీదుగా పంపిస్తారు.  

నేడు పార్కులకు సెలవు
తార్నాక: మిలియన్‌ మార్చ్‌ను పురస్కరించుకుని హెచ్‌ఎండీఏ పరిధిలోని పార్కులకు శనివారం సెలువు ప్రకటించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఎన్‌టీఆర్, లుంబిని పార్కు, సంజీవయ్య పార్కు, లేక్‌వ్యూ పార్కులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంటాయని ప్రజలు గమనించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement