తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వైఖరికి నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వైఖరికి నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా గట్టుప్పల్లో పీపుల్స్ వార్ రాచకొండ ఏరియా పేరిట పోస్టర్లు అతికించారు. బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టులు ప్రజలను కోరారు.
ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు గట్టుప్పల్ చేరుకుని పోస్టర్లను చించివేశారు. మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాలోనూ మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. కొయ్యూరం వద్ద రోడ్లపై చెట్లను నరికేశారు.