బ్లాక్ టికెటింగ్‌కు ఊతం | Ticket advance reservation date extended for 102 days | Sakshi
Sakshi News home page

బ్లాక్ టికెటింగ్‌కు ఊతం

Feb 27 2015 1:18 AM | Updated on Apr 3 2019 4:10 PM

బ్లాక్ టికెటింగ్‌కు ఊతం - Sakshi

బ్లాక్ టికెటింగ్‌కు ఊతం

అడ్వాన్స్ టికెట్ బుకింగ్ విషయంలో బ్లాక్ మార్కెట్‌కు అవకాశం కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

120 రోజులు టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్‌కు గడువు పెంపు   
సాక్షి, హైదరాబాద్: అడ్వాన్స్ టికెట్ బుకింగ్ విషయంలో బ్లాక్ మార్కెట్‌కు అవకాశం కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్‌కు 60 రోజుల గరిష్ట సమయం అందుబాటులో ఉండగా దాన్ని తాజా బడ్జెట్‌లో మంత్రి సురేశ్ ప్రభు 120 రోజులకు పెంచారు. అంటే నాలుగు నెలల ముందే టికెట్ రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించారన్నమాట. గతంలో కూడా 120 రోజుల ముందస్తు అవకాశం ఉండేది. కానీ దళారులు టికెట్‌లను ముందుగానే బ్లాక్ చేసుకుని ఎక్కువ ధరకు నల్లబజారులో విక్రయిస్తున్నట్లు తేలటంతో రెండేళ్ల క్రితం దాన్ని 60 రోజులకు కుదించారు. కానీ ప్రభు మళ్లీ 120 రోజులకు పెంచటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
  సాధారణ ప్రయాణికులు నాలుగు నెలల ముందు టికెట్ రిజర్వ్ చేసుకోవటం అరుదు. నెల, రెండు నెలల ముందు మా త్రమే ఎక్కువ మంది చేసుకుంటారు. దీన్ని గుర్తించే గతంలో గడువును 60 రోజు లకు కుదించారు. దీనిపై పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాలేదు. అయినా సురేశ్ ప్రభు దాన్ని మార్చటం విశేషం. టికెట్ బ్లాక్‌లో అమ్మేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ కొద్ది రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే జీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాంటి దళారులపై నిఘా వేసేందుకు 10 రోజుల స్పెషల్ డ్రైవ్ కూడా మొదలు పెట్టారు. కానీ బ్లాక్ మార్కెటింగ్‌కు ఊతమిచ్చేలా ఇప్పుడు నిర్ణయం తీసుకోవటం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement