ఎదురెదురుగా ఢీకొన్న మోటారు సైకిళ్లు | three injured in an accident in narayankhed | Sakshi
Sakshi News home page

Feb 14 2018 5:07 PM | Updated on Aug 25 2018 6:22 PM

three injured in an accident in narayankhed - Sakshi

చికిత్స పొందుతున్న మంజుల

నారాయణఖేడ్‌: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్‌ సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నారాయణఖేడ్‌ మండలంలోని అంత్వార్‌ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అంత్వార్‌ గ్రామానికి చెందిన సంగ్‌శెట్టి(41), మంజుల(16) ద్విచక్ర వాహనంపై నారాయణఖేడ్‌ వస్తున్నారు.

రేగోడ్‌ మండలం దోసపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌(22) నారాయణఖేడ్‌ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అంత్వార్‌ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అంత్వార్‌ సమీపంలో ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంగ్‌శెట్టి కాలు విరగగా మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు తగిలాయి. 108 అంబులెన్స్‌లో ఖేడ్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ నరేందర్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.     

Advertisement
 
Advertisement
Advertisement