పాముకాటుతో ముగ్గురి మృతి | Three died of snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో ముగ్గురి మృతి

Jun 21 2015 1:24 AM | Updated on Oct 22 2018 2:22 PM

పాముకాటుతో ముగ్గురి మృతి - Sakshi

పాముకాటుతో ముగ్గురి మృతి

జిల్లాలో శనివారం వేర్వేరుచోట్ల ముగ్గురు పాముకాటుకు గురై ప్రాణాలు విడిచారు. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి

బిజినేపల్లి : జిల్లాలో శనివారం వేర్వేరుచోట్ల ముగ్గురు పాముకాటుకు గురై  ప్రాణాలు విడిచారు. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన నాగపురం నరేందర్ అలియాస్ సాయికుమార్(10) పాముకాటు వేయడం తో  మృతిచెందాడు. గ్రామశివారులో ఉన్న వీరి ఇంట్లోకి తెల్లవారుజామున పాము వచ్చి నరేందర్‌ను కాటువేసింది.  తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో నరేందర్ మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదన  కంటతడిపెట్టించింది.

 ఇర్విన్‌లో బాలిక మృతి
 మాడ్గుల: మండలంలోని ఇర్విన్ గ్రామానికి చెందిన పెంటమళ్ల ప్రణతి (11)అనే బాలిక పాముకాటుకు గురై శనివారం మృత్యువాతపడింది. గ్రా మానికి చెందిన దేవదాసు, పుష్పమ్మ కు కొడుకు, కూతురు ప్రణతి ఉ న్నా రు. అందరూ శుక్రవారం రాత్రి భో జ నం చేసి ఇంట్లో నిద్రించారు. శని వా రం ఉదయం పాఠశాలకు వెళ్లడానికి ముస్తాబుచేస్తుండగా కడుపునొప్పు ఉందని తల్లికి చెప్పడంతో ప్రణతిని చి కిత్సకోసం ఆమనగల్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలిక పాముకాటుకు గురైందని, మెరుగైనవైద్యం కోసం వెంటనే హైదారాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించగా.. అక్కడికి వె ళ్తుండగా మార్గమధ్యంలోనే మృత్యువా తపడింది. మృతురాలు ప్రణతి ఐదో తరగతి చదువుతోంది. బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీపీ లక్ష్మమ్మ యాదయ్యగౌడ్ పరామర్శించారు.
 
 పైపాడులో యువకుడు
 శాంతినగర్ : పాముకాటుకు గురై యువకుడు మృతిచెందిన సంఘటన వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో శనివారం జరిగింది. బాధితుల కథనం.. గ్రామానికి చెందిన బోయచిన్న దస్తగిరి (21)రోజులాగే వ్యవసాయ కూలీపనిచేసుకుని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి వర్షం వస్తుందని కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పాముకరిచింది. కుటుంబసభ్యులు పామును చంపి నాటువైద్యుడి వద్ద చెట్టుపసరు తాగించారు. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య మల్లేశ్వరితోపాటు కూతురు ఉంది. మృతుడి తండ్రి సంజన్న ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసినట్లు శాంతినగర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement