ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ...ముగ్గురు మృతి | three died in lorry accident | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ...ముగ్గురు మృతి

Mar 28 2015 7:24 AM | Updated on Sep 2 2017 11:31 PM

వేగంగా వెళుతున్న లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు.

వరంగల్: వేగంగా వెళుతున్న లారీ ఇంట్లోకి దూసుకెళ్లడంతో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున వరంగల్ జిల్లా నరసింహుల పేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బీరిశెట్టిపల్లి గ్రామానికి చెందిన బండి సునీత(35), కూతురు ప్రగతి(13), కుమారుడు రాహుల్(15)లతో కలసి హోటల్ నడుపుకుంటు జీవనం సాగిస్తోంది. వరంగల్, ఖమ్మం జాతీయ ప్రధాన రహదారి పక్కనే తాత్కాలిక నివాసం ఏర్పరుచుకుని అందులోనే హోట్‌ల్ నడుపుకుంటున్నారు. అయితే వారు ఇంట్లో నిద్రిస్తుండగా శనివారం తెల్లవారం జామున ఖమ్మం వైపు వెళుతున్న లారీ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో ఉన్న తల్లితో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
(నరసింహులపేట)
 

Advertisement
 
Advertisement
Advertisement