ఇసుక దందాకు నిండు ప్రాణం బలి | Sand Lorry Traffic Issue In Bhadradri Kothagudem Dist | Sakshi
Sakshi News home page

ఇసుక దందాకు నిండు ప్రాణం బలి

Jun 23 2026 12:43 AM | Updated on Jun 23 2026 12:43 AM

Sand Lorry Traffic Issue In Bhadradri Kothagudem Dist

వంశీని భుజాలపై తీసుకెళ్తున్న బంధువులు. (ఇన్‌సెట్‌లో) వంశీ (ఫైల్‌)

ఇసుక లారీలతో మణుగూరులో ట్రాఫిక్‌ జామ్‌

20 కి.మీ. దూరానికి 2 గంటల సమయం

సకాలంలో వైద్యం అందక యువకుడు మృతి

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/మణుగూరు రూరల్‌: ఇసుక లారీల వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌ లో అంబులెన్స్‌ చిక్కుకోగా... ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తరలించలేని పరిస్థితి ఎదురైంది. ఇసుక లారీల వల్ల 20 కి.మీ దూరం ప్ర యాణానికి రెండు గంటలకుపైగా పట్టడంతో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన సోమవా రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో చోటుచేసుకుంది. పినపాక మండలం గడ్డిగూడెం గ్రామానికి చెందిన కొమురం వంశీ (32) బీటీపీఎస్‌ ప్లాంట్‌లోని బూడిద చెరువు వద్ద డెయిలీ లేబర్‌గా పని చేస్తున్నాడు.

ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన మార్గమధ్యలో వ్యక్తిగత కార ణాలతో గడ్డి మందు తాగగా, మణుగూరు మండలంలోని దమ్మక్కపేట లో మామ వరుసయ్యే మడి శంకర్‌ ఇంటికి వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో శంకర్‌ 108 కు ఫోన్‌ చేశారు. ఆపై అంబులెన్స్‌ వచ్చే వరకు ఆలస్యమవుతుందని బైక్‌పై మణుగూరు– ఏటూరునాగారం ప్రధాన రహ దారి వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో మణుగూరు వంద పడకల ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. సాంబాయిగూడెం దగ్గరికి ఆటో చేరుకోగానే రామానుజ వరం–1 ఇసుక రీచ్‌కు వచ్చి వెళ్లే లారీలతో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రెండు వైపులా కిలోమీటర్‌ మేర భారీ లారీ లు నిలిచిపోయాయి.

ఈ క్రమంలో వంశీ అపస్మారక స్థితికి చేరుకుంటుండటంతో ఆటోకు దారి వదలా లని కోరినా డ్రైవర్లు లారీలను రో డ్డు దించేందుకు ససేమిరా అన్నా రు. దీంతో 9–50 గంటల సమయా న వంశీని చేతులపై ఎత్తుకున్న బంధువులు మణుగూరు వైపు నడక సా గించారు. అంతలోనే మణుగూరు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్‌ ఎదురుకావ డంతో అందులోకి ఎక్కించినా ప్రధా న రహదారిపై ముందుకు, వెనక్కి వెళ్లే వీలులేక సాంబాయిగూడెం–పగిడేరు మీదుగా డొంక దారిలో గంటకుపైగా ప్రయాణించి ఉదయం 11–10 గంటలకు వంశీని మణుగూరు ఆస్పత్రికి చేర్చారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందారు. గంట ముందు తెచ్చి ఉంటే బతికించే అవకాశం ఉండేదని చెప్పడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement