పండుగ వేళ..మృత్యుహేల | The two young people dead | Sakshi
Sakshi News home page

పండుగ వేళ..మృత్యుహేల

Jan 17 2016 1:58 AM | Updated on Sep 3 2017 3:45 PM

పండుగ వేళ..మృత్యుహేల

పండుగ వేళ..మృత్యుహేల

ద్విచక్రవాహనం అదుపు తప్పి శుక్రవారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్రవాహనం
ఇద్దరు యువకుల దుర్మరణం
మద్యం మత్తులో నడపడమే కారణం?
శోకసంద్రంలో మృతుల కుటుంబాలు

 
ములుగు : ద్విచక్రవాహనం అదుపు తప్పి శుక్రవారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతిగా మద్యం తాగి ఇంటికొస్తుం డగా ఎదురుగా వచ్చిన లారీ లైట్ల వెలుతురు కళ్లపై పడటంతో సదరు యువకులు ద్విచక్రవాహనంపై అదుపు కోల్పోరుు, లారీని ఢీకొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరి దుర్మరణంతో బాధిత కుటుంబాల్లో పండుగ పూట విషాదఛాయలు అలుముకున్నారుు. ములుగు మండలంలోని పాల్‌సాబ్‌పల్లికి చెందిన బిల్లా నర్సింహారెడ్డి అలియాస్ నాని (28), ములుగు మండలకేంద్రానికి చెందిన పైడిమల్ల శ్రావణ్ (23) సంక్రాంతి రోజున స్థానికంగా విందు చేసుకున్నారు. విందు అనంతరం ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా జాకారంలోని మసీదు సమీపంలో రోడ్డు పక్కకు ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు.మృతులిద్దరూ అవివాహితులే. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను 108 వాహనంలో ములు గు సివిల్ ఆస్పతికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం వారి స్వగ్రామాల్లో అం త్యక్రియలు నిర్వహించారు. ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్, ఎంపీటీసీ పోరిక గోవింద్‌నాయక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.
 
తల్లి మందలించినా వినకుండా వెళ్లిన శ్రావణ్
మృతుడు పైడిమల్ల శ్రావణ్ ఇటీవల అయ్య ప్ప మాల వేసుకొని విరమించుకున్నాడు. అతడి తండ్రి సురేందర్ మాలను కొనసాగిం చి విరమణకు శబరిమలకు బయలుదేరారు. తండ్రి ఇంట్లో లేకపోవడంతో శ్రావణ్ శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళుతుండగా..‘ ఈ రాత్రి ఎటుపోతన్నవ్ కొడుక. ఎక్కడికి పోకు’ అని మందలించింది. తల్లి మాట లను పట్టిం చుకోకుండా శ్రావణ్  తన స్నేహితుడు బిల్లా నానితో కలిసి విందుకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా తమ కుమారుడు మృతిచెందాడనే విషయం తెలుసుకున్న సురేందర్ శబరి యూత్రనువిరమించుకొని, ఇంటికి తిరిగి బయలుదేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement