క్వారీలో ప్రమాదం... | The risk of quarry in warangal | Sakshi
Sakshi News home page

క్వారీలో ప్రమాదం...

May 6 2015 2:47 PM | Updated on Sep 3 2017 1:33 AM

క్వారీలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది.

వరంగల్: క్వారీలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం వరంగల్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం శివారులో ఉన్న మెడ్‌వెస్ట్ క్వారీలో జరిగింది. వివరాలు.. క్వారీలో పేలుడు సంభవించడంతో అక్కడే పని చేస్తున్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రస్తుతానికి వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.
(కేసముద్రం)

Advertisement
 
Advertisement
Advertisement