ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి | The person killed in the collision, the lorry tractor .. | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

Apr 5 2017 10:07 AM | Updated on Apr 3 2019 8:07 PM

ట్రాక్టర్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

తల్లాడ(ఖమ్మం): ట్రాక్టర్ లో డిజిల్ అయిపోవడంతో డ్రైవర్ ట్రాక్టర్ ను రోడ్డు పక్కన నిలిపాడు. నిల్చొని ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
 
ఈ సంఘటన  జిల్లాలోని తల్లాడ మండలం లక్ష్మీనగర్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మిర్చీలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ డిజిల్‌ అయిపోవడంతో.. ఇంధనం నింపుతుండగా.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లవరం గ్రామానికి చెందిన చెరుకూరి రామారావు అనే రైతు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement