చెల్లింపునకు నేడే ఆఖరి గడువు | The final deadline for payment of property tax today | Sakshi
Sakshi News home page

చెల్లింపునకు నేడే ఆఖరి గడువు

Mar 31 2014 1:15 AM | Updated on Sep 2 2017 5:22 AM

ఆస్తిపన్ను చెల్లింపునకు ఈ నెల 31వ తేదీయే ఆఖరి గడువని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు.

బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఆస్తిపన్ను చెల్లింపునకు ఈ నెల 31వ తేదీయే ఆఖరి గడువని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (రెవెన్యూ) హరికృష్ణ, అదనపు కమిషనర్ (ప్లానింగ్) వెంకట్రామిరెడ్డి, సెంట్రల్ జోనల్ కమిషనర్ రోనాల్డ్‌రాస్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

గడువు ముగిసే సమయానికి రూ. 1100 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రూ. 895 కోట్ల పన్ను వసూలు చేశామన్నారు. ఉగాది రోజున సోమవారం రాత్రి 8 గంటల వరకు కూడా పన్ను చెల్లించవచ్చని, ఆన్‌లైన్‌లో కూడా చెల్లింపులు చేయవచ్చన్నారు. సమావేశంలో సర్కిల్-10 డీఎంసీ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement