అప్పుల బాధ తాళలేక... | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక...

Dec 2 2015 10:58 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ తాళలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధ తాళలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహులు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పత్తి దిగుబడి సరిగ్గా రాకపోవడంతో.. ప్టెటిన పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. దీంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక ఈ రోజు ఉదయం పత్తి చేను వద్దకు వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement