డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి | The baby died in the womb | Sakshi
Sakshi News home page

డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి

Jun 23 2017 7:36 PM | Updated on Sep 28 2018 3:41 PM

డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి - Sakshi

డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది.

కరీంనగర్: ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. వైద్యులు సరిగా పట్టించుకోక పోవడంతో శిశువు గర్భంలోనే మృతిచెందింది. ఈ సంఘటన జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం శ్రీరామ కాలనీకి చెందిన అంజలి అనే గర్భిణీని నిన్న  రాత్రి బంధువులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.

నొప్పులు రాకపోవడంతో వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తరువాత ఉదయం 9 గంటల వరకు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. చివరకు  11 గంటలకు అంజలి చనిపోయిన బిడ్డను ప్రసవించింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ గర్భంలోనే చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు.   

Advertisement
 
Advertisement
Advertisement