అనుమానంతో భార్యను చంపిన వ్యక్తి అరెస్ట్ | The arrest of the person who killed his wife | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను చంపిన వ్యక్తి అరెస్ట్

Feb 17 2016 7:24 PM | Updated on Jul 30 2018 8:29 PM

అనుమానం పెనుభూతమై భార్యను అంతమొందించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనుమానం పెనుభూతమై భార్యను అంతమొందించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక బుద్ధిపోచమ్మ వీధికి చెందిన రాంరెడ్డి, సుజాత(45) భార్యాభర్తలు. ఉపాధి కొరకు ఇరాక్ వెళ్లిన రాంరెడ్డి ఈ మధ్యకాలంలో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు.

ఈక్రమంలో భార్య ఓ పత్రికా విలేకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించి ఆమెను అంతమొందించేందుకు పథకం పన్నాడు. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో గొంతు నులిమి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రాంరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement