పోడుభూముల సాగుయత్నం..ఉద్రిక్తత | tension in khammam district | Sakshi
Sakshi News home page

పోడుభూముల సాగుయత్నం..ఉద్రిక్తత

Jun 15 2016 4:12 PM | Updated on Jun 4 2019 5:04 PM

పోడు భూములను సాగు చేసేందుకు యత్నించిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇల్లందు : పోడు భూములను సాగు చేసేందుకు యత్నించిన గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని పోడు భూముల్లో ఉన్న చెట్లు, ముళ్ల కంపలను కొట్టేసి సాగు చేసుకునేందుకు బుధవారం గ్రామస్తులు కొందరు యత్నించారు. అటవీ అధికారుల సమాచారంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోడు భూముల్లో ఉన్న మహిళలతో పాటు 30 మందిని అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement