తెలుగు ప్రజల శ్రేయస్సే ధ్యేయం | Telugu welfare of the populace Initiative | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజల శ్రేయస్సే ధ్యేయం

Dec 22 2014 1:56 AM | Updated on Sep 2 2017 6:32 PM

తెలుగు ప్రజల శ్రేయస్సే తమ ధ్యేయమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం..

ఖమ్మం స్పోర్ట్స్/కల్చరల్: తెలుగు ప్రజల శ్రేయస్సే తమ ధ్యేయమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ చైర్మన్ తాళ్లూరి జయశేఖర్ అన్నా రు. తానా, ప్రియదర్శిని కళాశాల సంయుక్తాధ్వర్యంలో ‘యువ-2014’ ఉత్సవాలు ఆదివా రం ఖమ్మం నెహ్రూనగర్‌లోని ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో ఆదివారం ప్రారంభమయ్యూరుు. ఈ కార్యక్రమంలో జయశేఖర్ మాట్లాడుతూ.. తానా స్థాపించి 40 ఏళ్లయిందని అన్నారు.

స్థాపించనప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి అమెరిలో తానా ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా ఇండియాలో 175మంది పేద విద్యార్థులకు 15వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తున్నామన్నారు. అమెరికాలో చదువుకుంటున్న ఏడుగురు విద్యార్థులకు తానా సహాయ సహకారా లు అందుతున్నాయన్నారు. హుదుద్ తుపాన్ బాధితుల కోసం తాము రెండుకోట్ల రూపాయలను విరాళంగా సేకరించామన్నారు. దీనిని ఈ నెల 23, 24 తేదీలలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఇస్తామన్నారు.

తెలంగాణ పభుత్వ అనుమతితో ఈ రాష్ట్రంలోని ఏదో ఒక ఊరును ‘తానా- మీ ఊరి కోసం’ పేరిట దత్తత తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా రు. ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగు వారై నా కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనే సద్దుద్దేశ్యంతో నే తానా స్థాపించినట్టు చెప్పారు. జూలై2,3,4 తేదీల్లో అమెరికాలో జరిగే తానా చైతన్య స్రవంతికి జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వానం పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఫెమా’ కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, ప్రియదర్శిని వి ద్యాసంస్థల అధినేత కాటేపల్లి నవీన్‌బాబు, జి ల్లా జూనియర్ కళాశాలల యూజమాన్యాల సం ఘం జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement