'19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి' | telangana people stay at home on august 19, cm kcr appeal | Sakshi
Sakshi News home page

'19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి'

Aug 5 2014 9:40 PM | Updated on Aug 14 2018 10:51 AM

'19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి' - Sakshi

'19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి'

సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నేపథ్యంలో ఈనెల19న ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని తెలంగాణలో నివసిస్తున్న ప్రజలను సీఎం కేసీఆర్‌ కోరారు.

కరీంనగర్: సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నేపథ్యంలో ఈనెల19న ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని తెలంగాణలో నివసిస్తున్న ప్రజలను సీఎం కేసీఆర్‌ కోరారు. ఏ కార్యక్రమం ఉన్నా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి, శ్రావణ మాసమే కాబట్టి మరో ముహూర్తం దొరుకుతుందని సలహాయిచ్చారు.

19న ఇంట్లో ఉండకుంటే మీ పేరు లిస్టులో ఉండదని చెప్పారు. ఆ రోజు లేనోడు లెక్కకు రాడు అని స్పష్టం చేశారు.  ఈ నెల 19న తాను కూడా ఇల్లు కదలనని అన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తమ వాదనలు 11న వినిపిస్తామని కేసీఆర్ తెలిపారు. తమ ఇబ్బందులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేశామని చెప్పారు. జర్నలిస్టులందరికి ఒకే యూనిక్ కార్డు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement