breaking news
house survey
-
క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిని పరిశీలించండి
సాక్షి, అమరావతి: ఇక్కడ కూర్చుని అంకెలతో అంతా బాగుందనే గత పాలకుల మూస ధోరణికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సుస్థిర ప్రగతి లక్ష్యాలు సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తొలి దశలో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు కార్యాచరణ రూపొందించింది. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల క్లస్టర్ల వారీగా వలంటీర్లు 1.52 కోట్ల కుటుంబాల ఇంటింటి సర్వే పూర్తి చేశారు. ఆ సర్వే ఫలితాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. వీటి ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రగతి లక్ష్యాల అమలు తీరు తెన్నులను తెలుసుకొనేందుకు, వాటిని మరింత మెరుగ్గా అమలు చేసి, లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పదిహేను రోజులకో సారి ఒక గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి, తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా తనిఖీలకు వెళ్లాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు నెలకు కచ్చితంగా రెండు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలని తెలిపింది. ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా తొలి దశలో మహిళా శిశు సంక్షేమం, విద్యకు సంబంధించిన 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని చెప్పింది. వాటి అమలులో లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్ది, సమర్ధంగా అమలయ్యేలా సచివాలయాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తిగా సఫలమయ్యాక పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని తెలిపింది. సచివాలయాల నుంచి సేకరించిన వివరాలు, ఇంటింటి సర్వే సమాచారంతో పాటు వారు గమనించిన పరిస్థితులపైన కూడా రిమార్కు రూపంలో ఇవ్వాలని తెలిపింది. సచివాలయం నుంచి సేకరించాల్సిన సమాచారమిది.. ► సచివాలయం పరిధిలో కౌమారదశలో ఉన్న (10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు) మహిళలు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంత మందికి రక్తహీనత ఉంది? వారు ఎంత శాతం ఉన్నారు? రక్తహీనత ఉన్న వారికి ఐఎఫ్ఏ టాబ్లెట్లు, పౌష్టికాహారం అందిస్తున్నారా? ► గర్భిణులు ఎంత మంది ఉన్నారు? 15 ఏళ్ల నుంచి 49 సంవత్సరాల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత మంది? వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం రెగ్యులర్‌గా అందిస్తున్నారా ? ► ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది? ఎంత మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తున్నారు? ఎదుగుదల లేక కుంచించుకపోయిన పిల్లలు ఎంత మంది? వారికి సకాలంలో టీకాలు, నులిపురుగుల నివారణ మందులు, పోషకాహారం అందిస్తున్నారా? మహిళా పోలీసులు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారా లేదా? ► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది? ఎంత మంది అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు? ఈ పిల్లలకు పూర్తిగా టీకాలు వేశారా? పోషకాహారం, మందులు అందిస్తున్నారా లేదా? ► ప్రాథమిక విద్యలో 1 నుంచి 8వ తరగతి వరకు నికర నమోదు రేషియో ఎలా ఉంది? 6 నుంచి 13 ఏళ్ల లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంత మంది ఎలిమెంటరీ స్కూల్స్‌లో నమోదయ్యారు? డ్రాపవుట్లు ఉంటే అందుగల కారణాలు ఏమిటి? ► ఉన్నత సెంకడరీ విద్య 11 – 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి విషయంలో సంక్షేమ, విద్యా అసిస్టెంట్ ఎలా పనిచేస్తున్నారు? 16 నుంచి 17 సంవత్సరాల వయస్సుగల వారు ఎంత మంది ఉన్నారు? వీరిలో ఎంత మంది ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐలో నమోదు అయ్యారు? డ్రాపవుట్స్ ఉంటే అందుకు కారణాలు ఏమిటి? ► ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని స్కూల్స్‌కు కనీస వసతులైన మంచినీరు, విద్యుత్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు లేవు? వసతుల్లేకపోవడానికి కారణాలు ఏమిటి? ► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? ఎన్ని స్కూళ్లకు బాలికల కోసం విడిగా టాయిలెట్లు ఉన్నాయి? ఏదైనా సమస్య ఉంటే అందుకు కారణాలు ఏమిటి? -
జనగణనకు ఆధార్ జోడీ
-
జనగణనకు ఆధార్ జోడీ
- నవంబర్‌లో ఇంటింటి సర్వే - కుటుంబ వివరాల అప్డేషన్ - ఆధార్ కార్డు నంబర్ల సీడింగ్ సాక్షి, హైదరాబాద్: జనగణన తరహాలోనే మరో ఇంటింటి సర్వేకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్పీఆర్)ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2011 జన గణన సమాచారానికి ఇప్పుడున్న తాజా మార్పులు చేర్పులను జోడించనుంది. పనిలో పనిగా ఆధార్ కార్డులను ఎన్పీఆర్ డేటాబేస్‌తో అనుసంధానం చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఆరంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం నవంబరులో ఈ సర్వే చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నవంబరు 16 నుంచి డిసెంబరు 15 వరకు ఇంటింటి సర్వే చేయాలని ప్రణాళిక విభాగం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనుంది. డిసెంబరు 31లోగా సర్వేను పూర్తి చేసి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. పది రోజుల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నివాసితుల వివరాల్లో చోటుచేసుకున్న మార్పులను కొత్తగా నమోదు చేస్తారు. నివాసితుడి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, చిరునామా, జన్మ స్థలం లాంటి వివరాల్లో మార్పులుంటే సరిదిద్దుతారు. 2011 జనాభా లెక్కల్లో నమోదు కాని కుటుంబాలు, సభ్యుల వివరాలుంటే తాజాగా నమోదు చేస్తారు. తెలంగాణలో ఇప్పటివరకు 98.5 శాతం ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయింది. సర్వే సందర్భంగా ఆధార్ కార్డు ఇప్పటికీ అందని కుటుంబాలుంటే వారి దగ్గరున్న ఎన్రోల్మెంట్ నంబర్లతో లింక్ చేస్తారు. ఇవి రెండూ లేకుంటే.. ఆధార్‌లో నమోదు కాలేదంటూ రికార్డుల్లో పేర్కొంటారు. ఆధార్‌ని తప్పనిసరి చేయవద్దంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. ఈ వివరాలు ఇవ్వటానికి ఎవరైనా నిరాకరిస్తే ‘నాట్ గివెన్’ అని రాయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే తమ దగ్గరున్న ఎన్పీఆర్ డేటాబేస్ ప్రకారం ఉన్న చిరునామాలో ఆ కుటుంబం లేకపోతే.. సర్వే అధికారులు ఇరుగుపొరుగు వారిని ఆరా తీస్తారు. జనాభా లెక్కల సర్వే తరహాలోనే ఈ వివరాల సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికకు ఆధార్ సీడింగ్‌తో కూడిన ఈ డేటాబేస్ అత్యంత ప్రామాణికంగా నిలుస్తుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ కుటుంబ వివరాల అప్డేషన్.. ఆధార్ కార్డుల సీడింగ్ సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అధికారులకు శిక్షణ ఇచ్చామని, అక్టోబరు మొదటి వారం నుంచి జిల్లా స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో శిక్షణ తరగతులను పూర్తి చేస్తామని ఆచార్య వివరించారు. -
కేసిఆర్ ఇంట్లో సమగ్ర సర్వే...
-
'19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి'
కరీంనగర్: సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నేపథ్యంలో ఈనెల19న ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని తెలంగాణలో నివసిస్తున్న ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ఏ కార్యక్రమం ఉన్నా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19న పెళ్లి ఉన్నా వాయిదా వేసుకోండి, శ్రావణ మాసమే కాబట్టి మరో ముహూర్తం దొరుకుతుందని సలహాయిచ్చారు. 19న ఇంట్లో ఉండకుంటే మీ పేరు లిస్టులో ఉండదని చెప్పారు. ఆ రోజు లేనోడు లెక్కకు రాడు అని స్పష్టం చేశారు. ఈ నెల 19న తాను కూడా ఇల్లు కదలనని అన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై తమ వాదనలు 11న వినిపిస్తామని కేసీఆర్ తెలిపారు. తమ ఇబ్బందులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేశామని చెప్పారు. జర్నలిస్టులందరికి ఒకే యూనిక్ కార్డు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు.