తెలంగాణ ఎంపీలకు హైదరాబాద్‌లో క్వార్టర్లు | telangana MP's quarters in hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంపీలకు హైదరాబాద్‌లో క్వార్టర్లు

Jun 20 2014 2:02 AM | Updated on Aug 15 2018 9:20 PM

తెలంగాణ ఎంపీలకు హైదరాబాద్‌లో నివాసం కోసం ప్రత్యేకంగా క్వార్టర్లను కేటాయించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు.

టీఆర్‌ఎస్ ఎంపీల ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకారం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంపీలకు హైదరాబాద్‌లో నివాసం కోసం ప్రత్యేకంగా క్వార్టర్లను కేటాయించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి. జితేందర్‌రెడ్డి నాయుకత్వంలో పార్టీ ఎంపీలు గురువారం కేసీఆర్‌ను ఆయున నివాసంలో కలిశారు. నియోజకవర్గ సవుస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు సౌకర్యం కోసం క్వార్టర్లను కేటాయించాలని, వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని ఈ సందర్భంగా ఎంపీలు విజ్ఱప్తి చేశారు. వీటికి స్పందించిన కేసీఆర్ కుందన్‌బాగ్ లేదా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎంపీలకు క్వార్టర్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement