breaking news
telangana MPs TRS
-
అద్వానీకి టీఆర్ఎస్ ఎంపీల మొర
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు.. గురువారం లోక్‌సభ వాయిదా అనంతరం భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా పెంచాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ అవసరం ఉందని, దానిపై సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన అద్వానీ.. ఆ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ చూపాలని కోరినట్టు సమాచారం. ఇప్పటికే, టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి రిజర్వేషన్ల పెంపు అంశాన్ని వివరించిన సంగతి తెలిసిందే. మరోవైపు వరుసగా ఐదోరోజు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సభలను స్తంభింపజేశారు. రిజర్వేషన్ల పెంపుపై చర్చించాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. -
తెలంగాణ ఎంపీలకు హైదరాబాద్‌లో క్వార్టర్లు
టీఆర్ఎస్ ఎంపీల ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంపీలకు హైదరాబాద్‌లో నివాసం కోసం ప్రత్యేకంగా క్వార్టర్లను కేటాయించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరించారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి. జితేందర్‌రెడ్డి నాయుకత్వంలో పార్టీ ఎంపీలు గురువారం కేసీఆర్‌ను ఆయున నివాసంలో కలిశారు. నియోజకవర్గ సవుస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు సౌకర్యం కోసం క్వార్టర్లను కేటాయించాలని, వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని ఈ సందర్భంగా ఎంపీలు విజ్ఱప్తి చేశారు. వీటికి స్పందించిన కేసీఆర్ కుందన్‌బాగ్ లేదా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎంపీలకు క్వార్టర్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.