'ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి' | telangana lawyers meet indrakaran reddy today | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి'

Mar 4 2015 4:13 PM | Updated on Sep 2 2017 10:18 PM

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. టి న్యాయవాదుల సంఘం బుధవారం మంత్రితో భేటీ అయింది. జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలు జరిగితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... హైకోర్టు ఏర్పాటు ప్రాముఖ్యతను సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికే ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement