హైకోర్టు చెప్పినా అంతేనా?

Telangana High Court Serius on GHMC About COVID 19 List Details - Sakshi

గ్రేటర్‌లో కోవిడ్‌ బాధితుల వివరాలు అత్యంత గోప్యం

ఏరియాల వారీగా వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశం

వివరాలు లేకుండా వెబ్‌సైట్‌లో పెట్టిన యంత్రాంగం  

నగరంలో ఎక్కడేం జరుగుతుందో తెలియని వైనం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో 6 జోన్లు.. 30 సర్కిళ్లు.. 150 వార్డులున్నాయి. నగరంలో కోవిడ్‌– 19 కేసుల విస్తరణ బాగా పెరిగిపోయింది.దీని వ్యాప్తి ఏ ప్రాంతంలో ఎక్కడ ఎక్కువగా ఉందో
తెలిస్తే.. ఆ ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్త పడేందుకు వీలవుతుంది.  జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా పాజిటివ్‌ కేసుల వివరాల్ని ఏరోజుకారోజు కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్లకు  తెలియజేయాలని హైకోర్టు
ఆదేశించింది. తద్వారా అసోసియేషన్లు, ప్రజలు వ్యాధి నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, ప్రజలు కూడా జాగ్రత్త పడతారని తెలిపింది. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో కోర్టుకు విన్నవించేందుకే కాబోలు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం మొక్కుబడిగా వెబ్‌సైట్‌లో కోవిడ్‌– 19 వివరాలుంచామంటూప్రకటించింది. ఆ వివరాలు చూద్దామనుకున్న వారు తెల్లబోయారు.

సాధారణంగా వెబ్‌సైట్‌లో ఏదైనా ముఖ్య విషయం.. అందరికీ పనికివచ్చేది కొత్తగా ఉంచినప్పుడు వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే కనబడేలా స్క్రోల్‌ అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అలాంటిదేమీ లేదు సరికదా.. కరోనా కేసులు ఎక్కడ ఉన్నాయో అనౌన్స్‌మెంట్స్‌ విభాగంలో వెదుక్కుంటేనే కోవిడ్‌ డీటెల్స్‌ అని ఉంది. అందులోకి వెళ్తే  మండలం పేరు, పేషెంట్‌ ఐడీ ,లింగం, వార్డు, సర్కిల్, జోన్‌లుగా టేబుల్‌  ఉంది. టేబుల్‌లో చాలాచోట్ల  మండలం లేదు. మిగతా వివరాలున్నప్పటికీ, ఏదైనా ప్రాంతం వారు తమ పరిధిలో ఎన్ని కేసులున్నాయో తెలుసుకోవాలంటే  వివరాల్లేవు. పోనీ కనీసం ‘సెర్చ్‌’ వంటిది ఉండి వార్డు లేదా సర్కిల్‌ లేదా జోన్‌ల వారీగా తెలుసుకోవచ్చునేమో అనుకుంటే అదీ లేదు. 

ఏదో మొక్కుబడిగా..
37వేలకు పైగా  పేషెంట్స్‌ ఐడీలు ఉన్న జాబితాలో ఎవరైనా తమ వార్డు లేదా సర్కిల్‌లో ఎన్ని కేసులున్నాయో తెలుసుకోవాలనుకుంటే వార్డు లేదా సర్కిల్‌ పేరు ఉన్న ప్రతిచోటా ఒక్కటొక్కటిగా లెక్కించుకుంటూ వెళ్లాలన్న మాట.  ఈ లెక్కన దానికెంత సమయం పడుతుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. అన్ని వేలల్లో కచ్చితంగా లెక్కించడం కూడా సాధారణ ప్రజలకు సాధ్యమయ్యే పని కాదు. కేవలం హైకోర్టుకు సమాధానం ఇచ్చేందుకే హడావుడిగా వెబ్‌సైట్‌లో ఇలా ఉంచారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.  శనివారం నాడే ఈ వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచగా, వివరాలు సరిగా లేవని, వార్డుల వారీగా ఎలా తెలుసుకుంటారని ఆ రోజునుంచే  ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయింది. మొదటి రోజు అలా ఉంచినప్పటికీ, క్రమేపీ వార్డుల వారీగా వివరాలు అప్‌డేట్‌ చేస్తారేమోనని పలువురు భావించారు. కానీ.. ఇప్పటికీ అదే పరిస్థితి.  ఇలా ఉంచడం వల్ల  ఎవరికి ఉపయోగపడుతుందో, ఎలా ఉపయోగపడుతుందో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో జీహెచ్‌ఎంసీ యంత్రాంగానికే  తెలియాలి. 

ఆ వివరాలుంటేనే ప్రయోజనం..
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీలో పాజిటివ్‌ కేసుల వివరాలను వార్డుల వారీగా రోజూ హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. వివరాలను సంబంధిత కాలనీ అసోసియేషన్లకు, మీడియాకు తెలియజేస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. కానీ.. జీహెచ్‌ఎంసీ ఆ పని చేయలేదు. దేశంలోని కొన్ని నగరాల్లో ఏరియాల వారీగా వివరాలు వెల్లడిస్తున్నా.. జీహెచ్‌ఎంసీలో ఆ పని జరగడం లేదు. కోవిడ్‌– కంట్రోల్‌రూమ్‌ పేరిట వెలువరించే ప్రకటనలో కేవలం ఎన్నిఫోన్లు వస్తున్నాయి.. ఎన్ని అన్నపూర్ణ భోజనాలు పంపాం అన్న వివరాలు మాత్రం వెలువరిస్తున్నారు. ప్రజలకు కరోనా తీవ్రత తెలిసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా కరోనా మొదలైనప్పటి నుంచి ఎన్ని పాజిటివ్‌ కేసులు.. ఎంతమంది కోలుకున్నారు.. మరణాలెన్ని.. ఏరోజుకారోజు ఎన్ని కేసులు తదితర సమాచారంతోపాటు వార్డుల వారీగా వివరాలుంటేనే ప్రయోజనమని నగర ప్రజలు అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-08-2020
Aug 08, 2020, 08:39 IST
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 80 శాతం మందిలోఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు కానీ.. పరీక్షల్లో...
08-08-2020
Aug 08, 2020, 07:18 IST
చెన్నేకొత్తపల్లి: ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు ఓ యువకుడు తనకు కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నానంటూ బంధువులకు...
08-08-2020
Aug 08, 2020, 05:09 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి...
08-08-2020
Aug 08, 2020, 04:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం...
08-08-2020
Aug 08, 2020, 03:52 IST
సామాజిక ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.
07-08-2020
Aug 07, 2020, 19:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్‌ కేసులు...
07-08-2020
Aug 07, 2020, 19:31 IST
సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్‌కు క‌రోనా గండం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దర్శ‌కుడు తేజ‌, ఆర్ఆర్ఆర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన...
07-08-2020
Aug 07, 2020, 18:02 IST
సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి...
07-08-2020
Aug 07, 2020, 17:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది....
07-08-2020
Aug 07, 2020, 16:50 IST
రెండు రోజుల క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది.  వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు...
07-08-2020
Aug 07, 2020, 14:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏ కాల‌మైనా స‌రే, ఏ విప‌త్తులు వ‌చ్చినా స‌రే భార‌తీయులు వారి అల‌వాట్లు, ఇష్టాయిష్టాలు మార్చుకోలేరు. డ‌బ్బులు కూడ‌బెట్టి...
07-08-2020
Aug 07, 2020, 14:05 IST
సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివారణా చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు....
07-08-2020
Aug 07, 2020, 13:43 IST
న్యూయార్క్‌: మహమ్మారి కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ...
07-08-2020
Aug 07, 2020, 13:20 IST
రాజమహేంద్రవరం క్రైం: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీలు కరోనా బారిపడ్డారు. కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల...
07-08-2020
Aug 07, 2020, 12:53 IST
కోల్‌క‌తా :  కరోనా..సామ‌న్యుల నుంచి ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను సైతం బ‌లితీసుకుంటుంది. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ మంత్రి శ్యామల్ చక్రవర్తి (76)...
07-08-2020
Aug 07, 2020, 11:36 IST
సిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం ఒక్క‌రోజే అత్య‌ధికంగా 131 మందికి...
07-08-2020
Aug 07, 2020, 11:22 IST
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
07-08-2020
Aug 07, 2020, 11:11 IST
కరోనా కేసులు 10 లక్షల మార్క్‌ దాటిన రోజు నుంచి వచ్చిన కొత్త కేసులలో దాదాపు 38 శాతం ఐదు రాష్ట్రాల...
07-08-2020
Aug 07, 2020, 10:52 IST
అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్)తో కరోనా కట్టడి.
07-08-2020
Aug 07, 2020, 10:26 IST
కోవిడ్-19 కార‌ణంగా మొద‌టిసారిగా ఓ జ‌డ్జి క‌న్నుమూశారు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top