సచివాలయం కూల్చివేతకు హైకోర్టు ఓకే | Telangana High Court Green Signals To Construct New Secretariat | Sakshi
Sakshi News home page

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Jun 29 2020 11:21 AM | Updated on Jun 29 2020 11:41 AM

Telangana High Court Green Signals To Construct New Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.

వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషన్లు వాదనలు వినిపించగా, ప్రభుత్వ పాలసీ విధానాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ వాదనలతో ఏఖిభవించిన ధర్మాసనం.. సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్ని తొలిగిపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement