9న మహారాష్ట్ర గవర్నర్‌కు టీ సర్కార్ సత్కారం | telangana government to honour maharashtra governor on 9th | Sakshi
Sakshi News home page

9న మహారాష్ట్ర గవర్నర్‌కు టీ సర్కార్ సత్కారం

Nov 6 2014 1:35 AM | Updated on Sep 2 2017 3:55 PM

మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సి.హెచ్.విద్యాసాగర్ రావును ఈనెల 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది.

సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సి.హెచ్.విద్యాసాగర్ రావును ఈనెల 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్‌రావుకు గౌరవ పూర్వకంగా జరిపే ఈ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. జలవిహార్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తెలంగాణలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తున్నట్లు సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement