Maharashtra Governor
-
రాజీనామా యోచనలో మహారాష్ట్ర గవర్నర్?
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి(80) రాజీనామాకు సిద్ధం అవుతున్నారా?.. ఈ విషయాన్ని పరోక్షంగా ఆయనే వెల్లడించడం గమనార్హం. తాను గవర్నర్ హోదా నుంచి హుందాగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించారట. సోమవారం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది మహారాష్ట్ర రాజ్‌భవన్. ప్రధాని మోదీ తాజాగా(జనవరి 19వ తేదీన) ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానితో తాను గవర్నర్ హోదా నుంచి తప్పుకోవాలని భావిస్తున్న విషయాన్ని చెప్పినట్లు గవర్నర్ కోష్యారి తెలిపారు. అంతేకాదు.. మరేయితర రాజకీయ బాధ్యతలు కూడా తనకు కేటాయించొద్దని ఆయన ప్రధానిని కోరారట. బీజేపీ సీనియర్ నేత అయిన భగత్ సింగ్ కొష్యారి.. వయో భారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన శేష జీవితాన్ని పుస్తక పఠనం, సాహిత్య రచనతో గడపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ప్రధాని మోదీకి తానంటే ఎంతో అభిమానమని, కాబట్టి తాను తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగానే స్పందిస్తారని భావిస్తున్నట్లు కోష్యారి ఆ ప్రకటనలో వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేయడాన్ని తానెంతో గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారాయన. ఆరెస్సెస్ మూలాలు ఉన్న కోష్యారి.. గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీతో పాటు అదనంగా మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఉత్తరాఖండ్‌కు రెండో ముఖ్యమంత్రిగా, ఆపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా, నైనిటాల్-ఉధమ్‌సింగ్ నియోజకవర్గం తరపున ఒకసారి లోక్‌సభకూ ఆయన ఎన్నికయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న టైంలో ఆయన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగతంగానూ ఆయన్ని ఇబ్బంది పెట్టిన కామెంట్ ఒకటి ఉంది. మహారాష్ట్ర నుంచి గుజరాతీలను, రాజస్థానీ మార్వాడీలను గనుక వెళ్లగొడితే.. ముంబైకి దేశ ఆర్థిక రాజధాని హోదా ఉండబోదని, డబ్బే మిగలదని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారాయన. ఈ వ్యవహారంలో బీజేపీ సైతం ఆయనకు దూరంగా ఉంటూ వచ్చింది. చివరకు వ్యవహారం పెద్దది అవుతుండడంతో.. ఆయన మరాఠ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆపై కిందటేడాది నవంబర్‌లో.. ఓ యూనివర్సిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఛత్రపతి శివాజీ మహరాజ్ పాత తరం ఐకాన్ అని, ఈ తరం వాళ్లకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్లే ఐకాన్ అంటూ వ్యాఖ్యానించి.. మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. -
మహారాష్ట్ర ప్రజలకు గవర్నర్ కోశ్యారీ క్షమాపణలు
ముంబై: మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమం వేదికగా గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్. ఈ మేరకు మరాఠీలో క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. జులై 29న అందేరీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్బంగా.. ‘మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా ముంబై, థానేల నుంచి గుజరాతీలు, రాజస్థానీలు వెళ్లిపోతే.. ఇక్కడ డబ్బులే ఉండవు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబై కొనసాగదు.’అంటూ పేర్కొన్నారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. ఆయనపై శివసేన, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కష్టపడి పనిచేసే మరాఠీలను అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సైతం తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు గవర్నర్ వ్యక్తిగతమని, దానిని తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. मा. राज्यपालांचे निवेदन pic.twitter.com/3pKWHYgPp8 — Governor of Maharashtra (@maha_governor) August 1, 2022 ఇదీ చదవండి: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్! -
మరాఠీ బిడ్డలను అవమానించారు.. గవర్నర్ వ్యాఖ్యలపై థాక్రే ఫైర్
ముంబై: మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబైలో డబ్బే ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే స్పందించారు. భగత్ సింగ్ కోశ్యారి వ్యాఖ్యలు మరాఠీ బిడ్డలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. హిందువులను విభజించేలా గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఆయనను ఇంటికి పంపుతారో లేక జైలుకు పంపుతారో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలన్నారు. భగత్ సింగ్ కోశ్యారి గౌరవ పదవిని చూసి ఇంకా ఎంతకాలం సైలెంట్‌గా ఉండాలో తనకు అర్థం కావడం లేదని థాక్రే అన్నారు. గవర్నర్ పదవిని చేపట్టేవారు కనీసం వారు కూర్చునే కుర్చీనైనా గౌరవించాలన్నారు. అంతేకాదు కరోనా సమయంలో ఆలయాలను త్వరగా తెరవాలని గవర్నర్ తొందరపెట్టారని థాక్రే ఆరోపించారు. గతంలో ఆయన సావిత్రిబాయ్ పూలేను కూడా అవమానించారని పేర్కొన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపించి వేస్తే దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో డబ్బు ఉండదని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అన్నారు. వాళ్ల వల్లే ముంబైకి పేరు వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. చదవండి: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలపై దుమారం.. రాజీనామాకు డిమాండ్! -
Maharashtra Governor: ‘గుజరాతీలతోనే ముంబైకి ఆర్థిక రాజధాని పేరు’
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే రాష్ట్రంలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. ముంబైలోని అంధేరీలో ఓ చౌక్‌కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గవర్నర్. రాజీనామాకు శివసేన డిమాండ్.. గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరారు. ‘బీజేపీ ప్రతిపాదిత ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే మరాఠీలకు అవమానం ఎదురైంది. గవర్నర్ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించాలి. ఇది కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలకు అవమానం. సీఎం షిండే మీరు వింటున్నారా? నీపై నీకు ఆత్మగౌరవం ఉంటే.. గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలి.’ అంటూ ట్వీట్ చేశారు రౌత్. మరోవైపు.. కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘రాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించటం చాలా బాధాకరం. ఆయన పదవీ కాలంలో గవర్నర్ అధికారాలు, మహారాష్ట్ర రాజకీయ సంప్రదాయాలు దెబ్బతినటమే కాదు.. రాష్ట్రాన్ని తరుచుగా అగౌరవపరుస్తున్నారు.’ అని పేర్కొన్నారు సచిన్ సావంత్. గవర్నర్ వెంటనే మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది. లేదంటే ఆయనను తొలగించాలని కేంద్రాన్ని కోరతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులకు ఇది సరైనదేనా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? హో.. వారి కెబినెట్ మంత్రులకు ఆమోదం లభించనందుకేమో.. అంటూ ఎద్దేవ చేశారు ప్రియాంక. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
మహారాష్ట్ర గవర్నర్ రఫెల్ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్ రౌత్ సెటైర్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌లమీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు(గురువారం) బల నిరూపణ పరీక్ష జరగనుంది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటలలోపు బల పరీక్ష ప్రక్రియ ముగించాలని మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి గవర్నర్ లేఖ రాశారు. దీంతో బలపరీక్షపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు సాయంత్రం 5 గంటలకు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జెట్ స్పీడ్ కంటే వేగంగా.. తాజాగా గవర్నర్ ఆదేశాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ గురువారం బలపరీక్షకు ఆదేశించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా రౌత్ అభివర్ణించారు. గవర్నర్ జెట్ స్పీడ్ కంటే వేగంగా వ్యవహరించారని సెటైర్లు వేశారు. రాఫెల్ జెట్ కూడా ఇంత వేగంగా ఉండదని అన్నారు. అంతేగాక గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బల పరీక్ష కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలన్న గవర్నర్ ఆదేశాలపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయిచారని రౌత్ చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు బల పరీక్ష వంటి చర్య ఏదైనా చట్టవిరుద్దమని ఆయన అన్నారు. ‘రెబెల్ మ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఫ్లోర్ టెస్ట్ జరగదని మేం చెబుతూనే ఉన్నాం. ఇది చట్టవిరుద్ధమైన చర్య. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ, గవర్నర్ హౌజ్ కలిసి ప్రయత్నిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేం సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతాం. మాతో పోరాడాలనుకుంటే ముందుకు వచ్చి పోరాడండి’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. చదవండి: బలపరీక్ష ఆదేశాలు.. సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ భారీ భద్రత గురువారం బల పరీక్ష నేపథ్యంతో అసెంబ్లీ లోపల, బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఏ కారణంతోనైనా అసెంబ్లీ సమావేశం వాయిదాకు వీల్లేదని అన్నారు. బల పరీక్ష ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని తెలిపారు. -
'భజరంగీ భాయిజాన్' మున్నీకి ప్రతిష్టాత్మక అవార్డు.. వారికి అంకితం
Harshaali Malhotra Receives Bharat Ratna Dr Ambedkar Award: ఆంజనేయ స్వామి భక్తుడిగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మూవీ 'భజరంగీ భాయిజాన్'. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 2015లో విడుదలైన ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందించారు. స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటీనటుల యాక్టింగ్‌కు ఫిదా కావాల్సిందే. అందులో ముఖ్యంగా మున్నీగా అలరించిన హర్షాలీ మల్హోత్ర మైండ్‌లో నుంచి పోదు. అంతలా ఆకట్టుకుంది చిన్నారి హర్షాలీ. తాజాగా హర్షాలీకి అరుదైన గౌరవం దక్కింది. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) 13 ఏళ్ల హర్షాలీని మహరాష్ట్ర ప్రభుత్వం 'భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్' అవార్డుతో సత్కరించింది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ నుంచి ఈ పురస్కారాన్ని అందుకుంది ఈ బాల నటి. ఈ విషయాన్ని సోషల్ మీడియా అయిన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఈ బహుమతిని సల్మాన్ ఖాన్, కబీర్ ఖఆన్, చిత్ర నిర్మాతలకు అంకితం ఇస్తున్నట్లుగా పోస్ట్ పెట్టింది హర్షాలీ. ఈ పోస్ట్‌కు అనేకమంది నెటిజన్స్ స్పందించారు. హర్షాలీని చూస్తుంటే గర్వంగా ఉందని, ఇలాంటి విజయాలు మరెన్నో దక్కాలని కోరారు. 'మున్ని ఈ అవార్డు నీది మాత్రమే. ఎందుకంటే నీ యాక్టింగ్‌తోనే ఈ అవార్డు గెలుచుకున్నావ్' అని ఒక యూజర్ అభిమానం చూపించారు. ఇదిలా ఉంటే 'భజరంగీ భాయిజాన్' సినిమా సమయంలో హర్షాలీకి ఎనిమిదేళ్లు. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు -
మళ్లీ ‘మహా’ రగడ
సాక్షి ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం, గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వ విమానంలో గవర్నర్ ప్రయాణించేందుకు రాష్ట్ర సర్కారు గురువారం అనుమతి నిరాకరించింది. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు డెహ్రాడూన్‌కు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్ ముంబై ఎయిర్‌పోర్టులో విమానంలో కూర్చున్న అనంతరం అనుమతి లేదని అధికారులు తేల్చిచెప్పారు. దాదాపు రెండు గంటల తర్వాత ప్రైవేట్ విమానంలో గవర్నర్ డెహ్రాడూన్‌కు బయల్దేరారు. ప్రభుత్వ అధికారిక విమానంలో గవర్నర్ ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గవర్నర్ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మా తప్పేమీ లేదు: సీఎం ఆఫీస్ ప్రభుత్వ విమానంలో గవర్నర్ ప్రయాణించేందుకు ఇంకా అనుమతి లభించలేదని, ఈ విషయాన్ని రాజ్‌భవన్‌కు ముందే తెలియజేశామని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. గవర్నర్‌కు ఇబ్బంది కలిగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని పేర్కొంది. ప్రయాణంపై 10 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని గవర్నర్ కార్యాలయం తెలియజేసింది. -
గవర్నర్ విమాన ప్రయాణానికి సీఎం అడ్డు
ముంబై: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ఆ పరిస్థితి తీవ్రంగా ఉంది. తాజాగా గవర్నర్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవగా ఆయనకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిసి ఆయన ప్రైవేటు విమానంలో డెహ్రూడన్ వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో వివాదం రాజుకుంది. గవర్నర్ విమాన ప్రయాణానికి ముఖ్యమంత్రి అడ్డు తగిలారనే విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మధ్య విభేదాలు పెరిగాయి. అవి తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయి. గవర్నర్ విమాన ప్రయాణానికి మహా అఘాడీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన విషాద సంఘటన గురించి తెలుసుకునేందుకు విమానంలో డెహ్రడూన్ వెళ్లేందుకు కోశ్యారి సిద్ధమయ్యారు. ఈ మేరకు ముంబైలోని విమానాశ్రయానికి వెళ్లి రెండు గంటల పాటు వేచి ఉన్నారు. ప్రభుత్వ విమానంలో కూర్చున్న తర్వాత 15 నిమిషాల తర్వాత టేకాఫ్‌కు అనుమతి రాలేదని ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చెప్పారు. దీంతో కోశ్యారి చివరికి మరో విమానంలో టికెట్ బుక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చింది. వారం కిందటే గవర్నర్ పర్యటన గురించి ప్రభుత్వానికి చెప్పినా.. అనుమతి రాకపోవడం చాలా అసహజంగా ఉన్నదని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెప్పాయి. దీనిపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్‌కు విమానం ఇచ్చారో లేదో తనకు తెలియదని, కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటానని చెప్పారు. దీనిపై శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కూడా స్పందించారు. ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు గవర్నర్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రభుత్వ అనుమతి కోరారని అయితే ఆ విమానం ప్రయాణించగలదా లేదా అని తెలియలేదని పేర్కొన్నారు. ఈ కారణంగానే గవర్నర్‌కి అనుమతి లభించకపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలు మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు హక్కు ఉంది. ఇతరులు వాడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగానే అనుమతి లభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కక్షపూరితంగానే ప్రభుత్వం గవర్నర్‌కు విమానం అనుమతి ఇవ్వలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య గతంలోనే వివాదాలు ఉన్నాయి. లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై గవర్నర్ ప్రశ్నించారు. దీనిపై సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్‌కు మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఇప్పుడు తాజాగా విమాన అనుమతి విషయమై వివాదం రేగేలా ఉంది. -
గవర్నర్‌తో కంగన భేటీ
ముంబై: అధికార శివసేనను, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను తీవ్రంగా విమర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో సమావేశమయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు వివరించి, న్యాయం చేయాలని కోరానని ఆ తరువాత ఆమె వెల్లడించారు. ‘గవర్నర్‌ని కలిశాను. ఒక పౌరురాలిగా ఆయనను కలిసేందుకు వచ్చాను. ఒక కూతురుగా నన్ను చూశారు. నా సమస్య విన్నారు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అని గవర్నర్‌తో భేటీ అనంతరం కంగన వ్యాఖ్యానించారు. సోదరి రంగేలితో కలిసి ఆమె రాజ్‌భవన్‌లో కోశ్యారీని కలిశారు. ఆ సందర్భంగా గవర్నర్‌కు ఆమె పాదాభివందనం చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ముంబైపై, ముంబై పోలీసులపై కంగన తీవ్ర విమర్శలు చేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ ఒకసారి, మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులకు భయపడ్తున్నానని మరోసారి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, ముంబైకి రావద్దని కోరుతున్నామని సేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో బాంద్రాలోని కంగన కార్యాలయ భవనాన్ని అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. ఆ తరువాత, శివసేనపై, ఉద్ధవ్‌ఠాక్రేపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముంబైని అవమానించిన వారికి మద్దతా? ముంబైని పీఓకేతో పోలుస్తూ అవమానించిన కంగనకు బీజేపీ మద్దతిస్తోందని, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ అలా వ్యవహరిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ముంబై ప్రాముఖ్యతను దెబ్బతీసి, నగరాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని సామ్నా పత్రికలోని తన కాలమ్ ‘రోక్‌తోక్’లో పేర్కొన్నారు. మరాఠా ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఇదన్నారు. కంగన వ్యాఖ్యలను ఖండిస్తూ మహారాష్ట్రకు చెందిన ఒక్క బీజేపీ నేత కూడా ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. కంగన వ్యాఖ్యలను బాలీవుడ్ నటులెవరూ ఖండించకపోవడాన్ని ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో మౌనంగా ఉన్న పాండవులతో పోల్చారు. ‘ముంబై వల్ల పేరు, డబ్బు అన్నీ సంపాదించుకున్న మీరు.. అదే ముంబైని సహ నటి విమర్శిస్తే ఖండించరా? డబ్బే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. నటుడు అక్షయ్‌కుమార్ మినహా ఎవరూ దీనిపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ శ్లోకాలు నేర్పితే అత్యాచారాలు తగ్గుతాయి
ముంబై: దేశంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టాలంటే సంస్కృత శ్లోకాలను నేర్పించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నాగ్‌పూర్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంస్కృత 'శ్లోకాలు' నేర్పించాలని ఆయన నాగ్‌పూర్ విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణ అత్యాచారాలు, నేరాలను నియంత్రణపై మాట్లాడుతూ.. జ్ఞానం (బుద్ధి బలం), శక్తి (మదబలం), డబ్బును (ధన బలం) ప్రజలు ఎలా దుర్వినియోగం అవుతాయో వివరించారు. గతంలో ఇళ్లలో 'కన్యా పూజ' జరిగేది. కానీ ఇప్పుడు దేశంలో ఏమి జరుగుతోంది? 'దుష్టులు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారు. అధికార బలమనేది రక్షణ కోసమా? లేదా దుర్వినియోగించనికి ఉద్దేశించినదా?' అని గవర్నర్ ప్రశ్నించారు. ఇక నాగ్‌పూర్ యూనివర్సిటీ (ఎన్యూ) కొత్తగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ భవనం ప్రారంభోత్సవ వేడుకల్లో బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ అతిథిగా హాజరై ప్రసంగించడంతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద రూ .10 కోట్లు విరాళంగా ఇచ్చారు. -
గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కోపమొచ్చింది
సాక్షి, ముంబయి : మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కోపం వచ్చింది. తన ప్రసంగానికి మరాఠీ అనువాదం మిస్సయిందని ఆయన అటు శాసన మండలి చైర్మన్‌పై, శాసనసభ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చేష్టలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ఆ ప్రసంగానికి సంబంధించి మరాఠీ అనువాదం చేసేందుకు ఎవరు ప్రయత్నించనట్లు తాను గుర్తించానంటూ ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తూ ఆయన మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ రామ్‌రాజేనాయక్ నిమ్‌బకార్‌కు, అసెంబ్లీ స్పీకర్ హరిభౌ బగదేకు లేఖ రాశారు. 'ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తున్న సమయంలో నా ప్రసంగాన్ని మరాఠీలోకి అనువాదం చేయలేదు. ఇలాంటిది సీరియస్‌గా తీసుకోవాలనది నా ఉద్దేశం. దీనికి కారణమైనవారిపై కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియజేయాలి' అని విద్యాసాగర్ రావు లేఖలో పేర్కొన్నారు. -
భావ ప్రకటనతో సామాజిక న్యాయం
సిరిసిల్ల: భావప్రకటనతో సామాజిక న్యాయం జరుగుతుందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం–2017’డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డికి సోమవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ సాహిత్యకారులు సమాజహితాన్ని కోరుకుంటారని, వారి భావప్రకటన, భాషా ప్రయోగంతో సామాజిక న్యాయం దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలకమైన పాత్ర పోషించిందన్నారు. కవులు, కళాకారులు తమ కలాలు, గళాలను ఊరూవాడా వినిపించారన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలోనూ సాహిత్యం ప్రవాహంలా వచ్చిందన్నారు. దివంగత పీవీ నర్సింహారావు వంటి భారత ప్రధానులు ముందుగా సాహిత్యకారులని, ఆయన తన స్వీయ అనుభవాలను కథల రూపంలో ఆవిష్కరించారని వివరించారు. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం వస్తుందన్నారు. దేశానికి విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గవర్నర్ చెప్పారు. మేకిన్ ఇండియాలో చాలా పెట్టుబడులు వచ్చాయని, మనదేశంలోని చేతివృత్తులపై, మన యువతరంపై వారికి ఉన్న అపారమైన నమ్మకమే పెట్టుబడిగా మారుతోందని వెల్లడించారు. యువశక్తిలో ప్రపంచంలోనే ఇండి యా మొదటి స్థానంలో ఉంటుందన్నారు. రంగినేని ట్రస్ట్ సాహిత్యసేవలు, అనాథ పిల్లల సేవ, వృద్ధాశ్రమ నిర్వహణలో మానవత్వాన్ని ప్రదర్శిస్తూ.. ముందుకు సాగుతోందన్నారు. తానే స్వయంగా ఎంతోమంది అనాథ పిల్లలను ట్రస్ట్‌లో చేర్పించానని, ట్రస్ట్ ఉప్పు తిన్నందుకు ఇక్కడి దాకా వచ్చానని విద్యాసాగర్‌రావు అన్నారు. తెలంగాణ మంచి సీఎం ఉన్నారని, భాషతోనే తన దిశమారిందని కేసీఆర్ చెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. -
హాఫ్ మారథాన్‌లో అపశృతి
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదివారం ఉదయం ముంబైలో హాఫ్ మారథాన్‌ను ప్రారంభించారు. సీఎస్టీలో ఉత్సాహంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. మారథాన్‌లో పాల్గొన్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ కలకలం రేగింది. స్పృహ కోల్పోయిన యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. -
నేడు చెన్నైకు విద్యాసాగర్‌రావు
ఇన్చార్జ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం తమిళ ప్రజలకు రోశయ్య కృతజ్ఞతలు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్‌గా నియమితులైన మహారాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావు శుక్రవారం చెన్నైకు రానున్నారు. రాజ్ భవన్లో ఇన్చార్జ్ గవర్నర్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రస్తుత గవర్నర్ కొణిజేటి రోశయ్య బాధ్యతల నుంచి తప్పుకోని... తమిళ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. చెన్నై : తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జ్ గవర్నర్‌గా తెలుగు వారైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. దీంతో ఆయన తన బాధ్యతల్ని స్వీకరించేందుకు సిద్ధం అయ్యారు. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన చెన్నైకు రానున్నారు. రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఇన్చార్జ్ గవర్నర్‌గా విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమం తదుపరి తన బాధ్యతల్ని విద్యాసాగర్ రావుకు రోశయ్య అప్పగించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ ప్రమాణ స్వీకారం జరగనున్నది. ఈ కార్యక్రమంలో సీఎం జయలలితతోపాటుగా మంత్రులు, అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. కాగా, బాధ్యతల నుంచి తప్పుకోనున్న ప్రస్తుత గవర్నర్ రోశయ్య తమిళ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఇందుకు తగ్గ ప్రకటనను గురువారం రాత్రి సిద్ధం చేశారు. గవర్నర్ గా బాధ్యత గల పదవిలో ఐదేళ్ల పాటుగా పనిచేసిన తనకు ఎన్నో మధుర స్మృతులు మిగిలాయని రోశయ్య పేర్కొన్నారు. సంస్కృతిని అమితంగా గౌరవించే ఇక్కడి ప్రజలకు తన వంతు సేవ అందించే అవకాశం దక్కిందన్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలితతో పాటు ఆమె మంత్రి వర్గంలోని సహచరులకు, రాజకీయ పార్టీల నాయకులకు, మాజీ, ప్రస్తుత వీసీలకు, విద్యా మేధావులు, వివిధ విభాగాల్లోని వారికి, మీడియా మిత్రులకు, రాజ్ భవన్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తె లుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు తన మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని, వారందరికి హృదయ పూర్వకంగా అభినందనలు రోశయ్య అభినందనలు తెలిపారు. -
ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలుగు భాష
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలుగు భాష ఎదిగిందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కొనియాడారు.ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు సమూహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు మాట్లాడేవారంతా ఒకే సెల్‌ఫోన్ అని, డ్యూయల్ సిమ్ కార్డులు ఏపీ, తెలంగాణ అని పేర్కొన్నారు. తెలుగు భాషకు వెలకట్టలేమన్నారు. భవిష్యత్తులో తెలుగువారు ప్రపంచంలో ప్రముఖ పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాలను గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్.. వివిధ రంగాలకు ప్రముఖులకు అందజేశారు. -
గవర్నర్‌ను ఇక క్షమాభిక్ష కోరను
ముంబై: క్షమాభిక్ష కోసం మహారాష్ట్ర గవర్నర్ ముందు భవిష్యత్తులో పిటిషన్ దాఖలు చేయనని, తన తరఫున ఎవరూ ఆ ప్రయత్నం చేయొద్దని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శుక్రవారం స్పష్టం చేశారు. క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ దాఖలు చేసిన దరఖాస్తును ఆ రాష్ట్ర గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. ఇంకెప్పుడూ కట్జూగాని, దత్ కుటుంబసభ్యులుగాని దత్ తరఫున గవర్నర్ ముందు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయవద్దని ఆయన న్యాయవాదులు తెలిపారు. త్వరలో దత్ జైలు శిక్షాకాలం పూర్తి అవుతుందన్నారు. 1993 బాంబు పేలుళ్లకు సంబంధించి సంజయ్ దత్ పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
దారితప్పిన గవర్నర్ విద్యాసాగర్ రావు హెలికాప్టర్
హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హెలికాప్టర్ దారి తప్పడంతో కాసేపు కలకలం రేగింది. శుక్రవారం విద్యాసాగర్ రావు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ కు బయల్దేరిన సమయంలో ఆయన హెలికాప్టర్ దారి తప్పింది. అయితే.. నాందేడ్ కు వెళ్లాల్సిన హెలికాప్టర్ కాస్తా దారి తప్పి, అనుకోకుండా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దాదాపు 15 నిమిషాలు ఈ పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత మళ్లీ హెలికాప్టర్ ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మహారాష్ట్ర గవర్నర్ 'స్వచ్ఛ్ భారత్'
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, జెడ్పీ చైర్మన్ తులా ఉమ, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం పట్టుమని ఐదు నిమిషాలు కూడా కొనసాగకపోవడం గమనార్హం. గవర్నర్ రాక కోసం అప్పటి వరకూ వేచి చూసిన ఉద్యోగులు ఆయన వచ్చిన వెంటనే చీపుర్లు అందుకున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు రెండే రెండు నిమిషాలు చీపురుతో ఆస్పత్రి పరిసరాలను ఊడ్చి వెనుతిరగ్గా, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఆయన వెంటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అధికారులు, ఉద్యోగులు కూడా అంతటితో ముగించడంతో అక్కడున్నవారు విస్తుపోవాల్సి వచ్చింది. -
మహరాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఘన సన్మానం
-
9న మహారాష్ట్ర గవర్నర్‌కు టీ సర్కార్ సత్కారం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సి.హెచ్.విద్యాసాగర్ రావును ఈనెల 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్‌రావుకు గౌరవ పూర్వకంగా జరిపే ఈ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. జలవిహార్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తెలంగాణలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తున్నట్లు సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. -
సీట్ల సర్దుబాటు చర్చలు సానుకూలం
ముంబై: శివసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని బీజేపీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. తుది దశకు చేరుకుంటున్నాయన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి త్వరలో లాంఛనంగా ఓ ప్రకటన విడుదల చేస్తామన్నారు. ఆర్పీఐతో, స్వాభిమాన్ శేత్కీరీ సంఘటన్ పార్టీలతోనూ ఇదే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. తాము కనుక అధికారంలోకి వస్తే కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం నిర్ణయాలను సమీక్షిస్తామన్నారు. ఈ రెండు పార్టీల పాలనలో వ్యక్తిగత లబ్ధి కోసమే నిర్ణయాలు జరిగాయని, అవినీతి వాసన గుప్పుమంటోందని అన్నారు. -
మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు ప్రమాణం
హాజరైన సీఎం పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రి గడ్కారీ తదితరులు సాక్షి, ముంబై: మహారాష్ర్ట గవర్నర్‌గా చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 4.10 గంటలకు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్‌షా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, మహారాష్ర్ట నాయకులు హర్షవర్ధన్పాటిల్, ఛగన్ భుజ్‌బల్, కిరిట్ సోమయ్య, సుధీర్ మునగంటివార్, నటి సైనా ఎన్సీ, చెన్నమనేని కుటుంబసభ్యులు హాజరయ్యారు. యూపీఏ హయాంలో మహారాష్ర్ట గవర్నర్‌గా నియమితులైన శంకర్నారాయణన్ను ఎన్డీఏ ప్రభుత్వం రాజీనామా చేయాలని కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించడంతో మిజోరమ్‌కు బదిలీ చేసింది. అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడని శంకర్నారాయణన్ ఏకంగా గవర్నర్ పదవికే రాజీనామా చేసిన విషయం విదితమే. -
గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం
ముంబై: మహారాష్ట్ర గవర్నర్‌గా బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భన్లో బొంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా విద్యాసాగర్‌రావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్, అతని మంత్రి వర్గ సహచరులు, ఇతర ముఖ్యులు హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఈ నెల 27న నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్‌రావు, రాజస్థాన్ గవర్నర్‌గా కల్యాణ్ సింగ్, కర్ణాటక గవర్నర్‌గా వజూభాయ్ వాలా, గోవా గవర్నర్‌గా మృదులా సిన్హాలను నియమించారు. -
30న విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌గా నియమితులైన నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహా పలువురు మంత్రులను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను, పార్టీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌గా అవకాశం ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. -
మహారాష్ట్ర గవర్నర్‌గా చెన్నమనేని
మరో మూడు రాష్ట్రాలకూ కొత్త గవర్నర్లు న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంళవారం ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్‌రావును, రాజస్థాన్ గవర్నర్‌గా కల్యాణ్ సింగ్‌ను, కర్ణాటక గవర్నర్‌గా వజూభాయ్ వాలాను, గోవా గవర్నర్‌గా మృదు లా సిన్హా నియమితులయ్యారు. గవర్నర్ల నియామకానికి కేంద్రం ప్రతిపాదించిన పేర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితుడైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్ జిల్లా కు చెందిన నేత. గత ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ గవర్నర్‌గా నియమితుడైన సీనియర్ బీజేపీ నేత 82 సంవత్సరాల కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు. కర్ణాటక కొత్త గవర్నర్ 76ఏళ్ల వజూభాయ్ వాలా గుజరాత్ బీజేపీ సీనియర్ నేత. ఇక గోవా గవర్నర్‌గా నియమితురాలైన మృదుల సిన్హా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు. మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ రాజీనామా, రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ పదవీ విరమణ కావటం, గోవా గవర్నర్ పదవినుంచి వైదొలగిన వీబీ వాంచూల స్థానాల్లో వీరు నియమితులయ్యారు. షీలా దీక్షిత్ రాజీనామా కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ఢిల్లీలో కలుసుకున్న మరుసటిరోజునే షీలా దీక్షిత్ రాజీనామా సమర్పించారు. ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి సచివాలయం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. తాను సోమవారమే రాజీనామాచేశానని, దీనిపై ఇంతకు మించి మాట్లాడదలుచుకోలేదని షీలా దీక్షిత్ అన్నారు. అంచెలంచెలుగా గవర్నర్ స్థాయికి.. సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన,.. బీజేపీలోఅంచెలంచెలుగా ఎదిగారు. 69ఏళ్ల విద్యాసాగర్ రావు వృత్తిరీత్యా న్యాయవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. 1985, 1989, 1994లో కరీంనగర్ జిల్లా మెట్పల్లి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 1985 నుంచి 1998 వరకు ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ఆయన బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంనుంచి 1998, 1999లో ఎన్నికై, వాజ్‌పేయి కేబినెట్లో స్థానం సాధించారు. 1999లో ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యుడుగా పనిచేసిన విద్యాసాగర్ రావు, 1972లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో ఏబీవీపీ విభాగం అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో అంతర్గత భద్రతా నిర్వహణా చట్టం(మీసా)కింద ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత జనసంఘ్‌లో, బీజేపీలో కీలకపాత్ర పోషించారు. గోదావరిలో నీటి వృధాను అరికట్టేందుకు సేద్యపునీటి ప్రాజెక్టు నిర్మించాలంటూ 1998లో పాదయాత్ర నిర్వహించారు. -
విద్యాసాగరరావుకు బీజేపీ సన్మానం
-
ముచ్చటగా మూడోవాడు!
ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ సహాయమంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. దాంతో ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ముచ్చటగా మూడో అచ్చ తెలుగువ్యక్తి సిహెచ్. విద్యాసాగరరావు. ఇప్పటికే ఇద్దరు తెలుగు వ్యక్తులు మహారాష్ట్ర గవర్నర్ పదవిని అలంకరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన ప్రభాకర్ రావు (ప్రముఖ సినీ మాటల రచయిత కోన వెంకట్ తాతగారు) మహారాష్ట్ర గవర్నర్ పదవిని చేపట్టిన మొట్టమొదట తెలుగు వ్యక్తి. దాదాపు ఏడాదిపైగా ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ పదవిని అలంకరించిన రెండో వ్యక్తి. ఆయన రెండేళ్ల వరకు ఆ పదవిలో ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి సిహెచ్ విద్యాసాగరరావు ఆ పదవిని చేపట్టనున్నారు. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహారించిన విద్యాసాగరరావు... రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం విదితమే. గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వి. రామారావును సిక్కిం గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ 282 సీట్లు కైవసం చేసుకుంది. దాంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ ప్రభుత్వ హాయాంలో నియమించిన గవర్నర్లకు మంగళం పాడుతూ వారి స్థానాల్లో బీజేపీ నాయకులను గవర్నర్ పదవుల్లో నియమించే కార్యక్రమంలో భాగంగా విద్యాసాగర్ రావు ఎంపిక జరిగింది. -
మహారాష్ట్ర గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే గోవా గవర్నర్‌గా మృదుల సిన్హా, కర్ణాటక గవర్నర్‌గా వీఆర్ వాలా, రాజస్థాన్ గవర్నర్‌గా కళ్యాణ్ సింగ్ నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల గవర్నర్ల నియమానికి సంబంధించిన ఫైల్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. అయితే బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఓ సారి కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న కె.శంకర నారాయణన్ మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ శనివారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మిజోరాం గవర్నర్ గా వెళ్లేందుకు శంకర నారాయణన్ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దాంతో మహారాష్ట్ర గవర్నర్ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. శంకర్ నారాయణన్ రాజీనామా చేసిన రెండు రోజులకు కొత్త గవర్నర్ ను నియమిస్తు రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. -
గవర్నర్ బదిలీ వివాదం..
ముంబై: హఠాత్తుగా మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్‌ను మిజోరామ్‌కు బదిలీ చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించింది. అయితే బదిలీ వెనుక చాలా కారణాలు ఉన్నాయని, అందులో ముఖ్యమైనది.. చవాన్ మోడీ సభకు నో చెప్పడానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. నాగపూర్‌లో శనివా రం ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ బహిష్కరించారు. దీనికి కొన్ని రోజు ల ముందు షోలాపూర్‌లో ప్రధాని మోడీ హాజరైన సభలో చవాన్‌కు అవమానం జరిగింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని కొందరు అడ్డుకున్నారు. ఆ సమయంలో మోడీ కూడా వారిని వారించే ప్రయత్నించలేదని పేర్కొంటూ అధికార పక్షం కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం, అధికారులు నాగపూర్ సభకు గైర్హాజరయ్యారు. మహారాష్ట్రతోపాటు కాశ్మీర్, హ ర్యానా, జార్ఖండ్‌లోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. యూపీ ఏ ప్రభుత్వం నియమించిన డజను గవర్నర్లలో శం కరనారాయణన్ ఒకరు. అయితే మోడీ నేతృత్వం లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక రూపొందించిన హిట్‌లిస్టులో శంకరనారాయణన్ పేరు కూడా ఉంది. ఒకటి, రెండు నెలల్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గవర్నర్ మార్పిడిపై ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారించిందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీంతో గవర్నర్ పదవికి రాజీ నామా చేయాల్సిందిగా గత నెలే కేంద్రం నుంచి శంకరనారాయణన్‌కు ఆదేశాలు అందినా, ఆయన ససేమిరా అన్నారు. దీంతో ఇక మోడీ ప్రభుత్వం ఆయన జోలికి రాదేమోనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో గత వారం చవాన్ మోడీ సభను బహిష్కరించడం వల్ల గవర్నర్ బదిలీకి అవకాశాలు ఎక్కువయ్యాయని భావిస్తున్నారు. కేంద్రంలో కొత్త పార్టీలు అధికారంలోకి వస్తే ప్రతిపక్షాలకు చెందిన గవర్నర్లపై దృష్టి సారించడం మామూలే. ఈ నేపథ్యంలో శంకరనారాయణన్ రెండు ఎంపికలు మిగిలాయి మొదటిది: పదవికి రాజీ నామా చేయడం. రెండోది : మూడేళ్లపాటు మిజోరామ్ గవర్నర్‌గా కొనసాగడం. అయితే ఆయన మొదటిదానికే సిద్ధపడి రాజీనామా సమర్పించారు. మహారాష్ట్ర ఇన్చార్జి గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లీకి బాధ్యతలను అప్పగించిన తరువాతే శంకరనారాయణన్‌ను బదిలీ చేశారు. అంతేగాక ఆదివారం సాయంత్రం కోహ్లీ ప్రమాణ స్వీకారానికి సీఎం చవాన్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు కూడా. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన శంకరనారాయణన్ బదిలీపై 2010లో మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012లో ఆయన పదవీకాలాన్ని రెండోసారి పొడగించారు. ఇంతకుముందు ఆయన జార్ఖండ్, నాగాలాండ్ గవర్నర్లుగా పనిచేశారు. మృదుస్వభావిగా పేరున్న ఈ కేరళవాసి అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడమేగాక, వివాదాలకూ దూరంగా ఉన్నారు. రాజీమా నాపై ఆదివారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన క్లుప్తంగా జవాబు చెప్పారు. ‘పదవిలో ఉన్నప్పుడు నేను రాజకీ యాలకు పాల్పడలేదు. అన్ని పార్టీలతో స్నేహంగా ఉన్నాను. నాతో రాజీ నామా ఎందుకు చేయించారో కారణాలు మీకు తెలుసు’ అని ముగించారు. ఇక ఓం ప్రకాశ్ కోహ్లీ ప్రమాణ స్వీకారం కోసం ఆది వారమే కుటుంబ సమేతంగా రాజ్‌భవన్‌కు చేరు కున్నారు. ఆయనకు పోలీసులు గౌరవ వంద నం సమర్పించారు. ఈ వివాదంపై మహారాష్ట్ర కాంగ్రెస్ స్పందిస్తూ రాజ్యాంగ పదవుల గౌరవాన్ని తగ్గిం చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇదని విమర్శించింది. -
మహారాష్ట్ర గవర్నర్‌గా కోహ్లీ ప్రమాణం
ముంబై: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యాక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ ఎస్ షా ఆయనే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇతర మంత్రులు పాల్గొన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న శంకర్ నారాయణన్‌ను మిజోరాంకు బదిలీ చేయడంతో ఆయన రాజీనామా చేశారు. దీంతో కోహ్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
గవర్నర్ పదవికి శంకర్‌నారాయణ్ రాజీనామా
-
బదిలీ చేస్తే రాజీనామా చేస్తా!
కొచ్చి:తనను మహారాష్ట నుంచి మిజోరాంకు బదిలీ చేసినట్లయితే ఆ పదవికి రాజీనామా చేస్తానని గవర్నర్ శంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. తాను మిజోరాంకు బదిలీ అవుతున్నట్లు ఎటువంటి అధికారిక సమాచారం లేదని.. కేవలం మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నానని ఆయన తెలిపారు. దీనిపై మీడియాలో పలుకథనాలు రావడంతో ఆయన స్పందించారు. ' నా బదిలీకి సంబంధించి ఎటువంటి సమాచారం ప్రభుత్వం నుంచి అందలేదు. నన్ను అవమానిస్తే గవర్నర్ పదవిలో అంటిపెట్టుకుని ఉండటానికి కొయ్యను కాదు. ఒకవేళ నన్ను బదిలీ చేస్తే అవమానించేనట్లే' అని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు గవర్నర్ గా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. ఆ క్రమంలోనే తన బదిలీకి తెరలేపి ఉండవచ్చు అని తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీచేసింది మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ బదిలీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ మిజోరాం గవర్నర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గత అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లీ వ్యవహరిస్తారని రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. కె.శంకరనారాయణన్ పదవి కాలం 2017లో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర గవర్నర్ కమలా బెనీవాల మధ్య వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను మిజోరం గవర్నర్‌గా బదిలీ చేశారు. అనంతరం ఆమెను మిజోరం గవర్నర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మిజోరం గవర్నర్ పదవి ఖాళీ అయింది. అయితే మరో రెండు నెలల్లో కమలా బెనీవాల్ పదవి కాలం ముగియనన్న సమయంలో ఆమెపై వేటు పడిన సంగతి తెలిసిందే. -
రాజీనామా చేయను
స్పష్టంచేసిన గవర్నర్ సాక్షి, ముంబై: తన పదవికి రాజీనామా చేసేందుకు మహారాష్ట్ర గవర్నర్ కె. శంకర్నారాయణన్ నిరాకరించారు. పదవికి రాజీనామ చేయాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి ఫోన్ వచ్చిందని, రాష్ట్రపతి కోరేదాకా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన బుధవారం స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ హయాంలో నియమితులైన ఏడుగురు గవర్నర్లను రాజీనామ చేయించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంశాఖ కార్యదర్శి ద్వారా నేరుగా గవర్నర్లకు రాజీనామ చేయాలంటూ పంపుతున్నారు. వీటిపై స్పందించిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి వెంటనే రాజీనామ చేసిన విషయం తెలిసిందే. మిగిలినవారిలో కొందరు రాజీనామ బాటలో ఉండగా మరికొందరు గవర్నర్లు తమ పదవులకు రాజీనామ చేయడానికి సిద్ధంగా లేమని ప్రకటించారు. దీంతో మోడీ ప్రభుత్వం, గవర్నర్ల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా తాను రాజీనామ చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని శంకర్నారాయణన్ ధ్రువీకరించారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, ఆ అధికారమున్న వ్యక్తి(రాష్ట్రపతి) చెబితే తప్ప తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. తన పదవి కాలం 2017 మే ఏడో తేదీ వరకు ఉందని, అంతవరకు కొనసాగుతానన్నారు. పంజాబ్ గవర్నర్ శివ్‌రాజ్ పాటిల్, కేరళ గవర్నర్ షీలాదీక్షిత్ కూడా శంకర్నారాయణన్ బాటలోనేనడుస్తున్నారు. వారు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేరు. అయితే రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తూ తమకు ఇంతవరకు ఫోన్ ఎవరి నుంచి రాలేదని వారు చెబుతున్నారు.