మహారాష్ట్ర గవర్నర్గా కోహ్లీ ప్రమాణం | O.P. Kohli sworn in as Maharashtra governor | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర గవర్నర్గా కోహ్లీ ప్రమాణం

Aug 24 2014 9:38 PM | Updated on Sep 2 2017 12:23 PM

మహారాష్ట్ర నూతన గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ముంబై: మహారాష్ట్ర నూతన గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యాక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ ఎస్ షా ఆయనే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇతర మంత్రులు పాల్గొన్నారు.

మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న శంకర్ నారాయణన్ను మిజోరాంకు బదిలీ చేయడంతో ఆయన రాజీనామా చేశారు. దీంతో కోహ్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement