నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం పూర్తి | Nitish Kumar takes oath as Rajya Sabha member | Sakshi
Sakshi News home page

నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం పూర్తి

Apr 10 2026 2:55 PM | Updated on Apr 10 2026 3:20 PM

 Nitish Kumar takes oath as Rajya Sabha member

ఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. న్యూఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్ ఆయన కార్యాలయంలో నితీశ్ చేత ‍ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జేపీనడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు.

అయితే తన శాసనమండలి సభ్యత్వానికి మార్చి 30న నితీశ్ కూమార్‌ రాజీనామా చేశారు. ప్రస్తుతం బిహార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన తన పదవికి ఏప్రిల్‌ 14వ తేదీన తన పదవి నుంచి వైదొలగనున్నారు.  కాగా బిహార్‌ నూతన ముఖ్యమంత్రిగా  ప్రస్తుత ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు.   

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలలో నితీశ్‌కున్న అనుభవం పార్లమెంట్‌  సంప్రదాయాలను కాపాడడంలో ఎంతో సహకరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement