మహారాష్ట్ర గవర్నర్ 'స్వచ్ఛ్ భారత్' | swachh bharath in karimnagar | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర గవర్నర్ 'స్వచ్ఛ్ భారత్'

Apr 11 2015 4:11 PM | Updated on Sep 3 2017 12:10 AM

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, జెడ్పీ చైర్మన్ తులా ఉమ, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం పట్టుమని ఐదు నిమిషాలు కూడా కొనసాగకపోవడం గమనార్హం.

గవర్నర్ రాక కోసం అప్పటి వరకూ వేచి చూసిన ఉద్యోగులు ఆయన వచ్చిన వెంటనే చీపుర్లు అందుకున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు రెండే రెండు నిమిషాలు చీపురుతో ఆస్పత్రి పరిసరాలను ఊడ్చి వెనుతిరగ్గా, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ఆయన వెంటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అధికారులు, ఉద్యోగులు కూడా అంతటితో ముగించడంతో అక్కడున్నవారు విస్తుపోవాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement