సంస్కృత శ్లోకాలు నేర్పితే అత్యాచారాలు తగ్గుతాయి

If Sanskrit Verses Are Taught Rapes Will Be Reduced Says Governor Koshyari - Sakshi

ముంబై: దేశంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టాలంటే సంస్కృత శ్లోకాలను నేర్పించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంస్కృత 'శ్లోకాలు' నేర్పించాలని ఆయన నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణ అత్యాచారాలు, నేరాలను నియంత్రణపై మాట్లాడుతూ.. జ్ఞానం (బుద్ధి బలం), శక్తి (మదబలం), డబ్బును (ధన బలం) ప్రజలు ఎలా దుర్వినియోగం అవుతాయో వివరించారు. గతంలో ఇళ్లలో 'కన్యా పూజ' జరిగేది. కానీ ఇప్పుడు దేశంలో ఏమి జరుగుతోంది? 'దుష్టులు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారు. అధికార బలమనేది రక్షణ కోసమా? లేదా దుర్వినియోగించనికి ఉద్దేశించినదా?' అని గవర్నర్‌ ప్రశ్నించారు. ఇక నాగ్‌పూర్‌ యూనివర్సిటీ (ఎన్‌యూ) కొత్తగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్‌ భవనం ప్రారంభోత్సవ వేడుకల్లో బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ అతిథిగా హాజరై ప్రసంగించడంతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ .10 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top