‘ఆ తర్వాతే ఫలితాలు విడుదల చేయాలి’

Telangana Government Sould Clarify On Sports And Disability Quota Said By High Court  - Sakshi

హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ నియామకాల్లో స్పోర్ట్స్‌, వికలాంగుల కోటాని విస్మరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. 95 శాతం స్పోర్ట్స్‌, వికలాంగుల వాటా సరి చేసిన తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ సెక్రటరీ నియామకాలపై స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన వి​జ్ఞప్తిని తోసిపుచ్చింది.

 ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై, 14 ప్రశ్నలను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో ఇవ్వడంపై కూడా పూర్తి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్‌ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  కోర్టు అనుమతి లేకుండా నియామక పత్రాలను ఇవ్వవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top