ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి | Take care of health | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

May 24 2018 2:00 PM | Updated on Aug 21 2018 6:08 PM

Take care of health - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లాలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యపై శ్రద్ధ వహించాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయానికి నూతనంగా 20 బెడ్లు మంజూరయ్యాయి. ఏఆర్‌ సిబ్బంది విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ బెడ్లను కేటాయించారు.

గతంలో కూడా 20 బెడ్లు మంజూరయ్యాయి. ఈ సందర్బంగా ఎస్పీ కోటిరెడ్డి  బెడ్లను పరిశీలించి మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి విశ్రాంతి కూడా ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రావుల గిరిధర్, ఏఆర్‌ డీఎస్పీలు రామచందర్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఆర్‌ఐ నర్సయ్య, డీసీఆర్‌బీసీఐ తిరుపతి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement