
విద్యార్థినిపై అత్యాచారం
డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది.
తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి
108 అంబులెన్‌సలో ఆస్పత్రికి తరలింపు
మిడ్జిల్ : డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఈ ఘటన మిడ్జిల్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి. మసిగొండ్లపల్లికి చెందిన విద్యార్థిని (18) షాద్‌నగర్‌లో ఓపెన్ డిగ్రీ చదువుతోంది. బుధవారం ఉదయం మిడ్జిల్‌కు వచ్చి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న తన ఇంటర్ క్లాస్‌మేట్ అయిన మిడ్జిల్‌కు చెందిన ఆంజనేయులు చూసి ఇంటి దగ్గర దిగబెడతానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. జగబోయిన్‌పల్లి సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప డ్డాడు.
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ విద్యార్థిని అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఆమెను అక్కడే వదిలి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, పొలాల నుంచి ఇంటికి వస్తున్న తండావాసులు గమనించి యువకుడిని పట్టుకుని పోలీ సులకు అప్పగించారు. బాధితురాలి 108 అంబులెన్‌సలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై మిడ్జిల్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.