విద్యార్థినిని వేధించిన ప్రైవేట్ లెక్చరర్ | Student harasses private lecturer | Sakshi
Sakshi News home page

విద్యార్థినిని వేధించిన ప్రైవేట్ లెక్చరర్

Dec 4 2014 1:06 AM | Updated on Nov 9 2018 5:02 PM

ఖమ్మం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

  • తాళలేక ఆత్మహత్యాయత్నం
  • మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం... అశ్వాపు రం మండలం మల్లెమడుగు గ్రామానికి చెందిన విద్యార్థిని రోజూ కాలేజీ బస్సులో వస్తుంది.

    కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అశ్వాపు రానికి చెందిన రాజారావు కూడా అదే బస్సులో వస్తూ విద్యార్థినిని మానసికంగా వేధిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక.. తనను లెక్చరర్ వేధిస్తున్నాడని, తాను ఆ కాలేజీకి వెళ్లనని సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది.

    గమనించిన తల్లిదండ్రులు ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి  తరలించి చికిత్స చేయిస్తున్నారు.  లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి బంధువులు బుధవారం కళాశాల వద్ద ఆందోళన చేశారు.  లెక్చరర్  పరారీలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement