రైలు ఢీకొని విద్యార్థి మృతి | student dies in train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని విద్యార్థి మృతి

Apr 8 2015 11:58 AM | Updated on Sep 28 2018 3:39 PM

అపదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు.

వరంగల్: పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు.ఈ సంఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎలుకుర్తి గ్రామానికి చెందిన మండా చందు(15) పదో తరగతి పరీక్ష రాయడానికి ధర్మారం వచ్చాడు.

దారిలో ఉన్న రైల్వే గేటు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement