‘బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలి’

Srinivas Goud Speech On Bathukamma Festival Arrangements In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బతుకమ్మ ఏర్పాట్లను నిర్వహిస్తామని ఆబ్కారి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. 

బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరపాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమనవ్యయం చేసుకొని బతుకమ్మ పండగను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి  పార్థసారథి, టూరిజం కమిషనర్ సునీతా భగవత్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ అధికారులు మహేష్, ఎస్‌ఈ అశోక్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top