సింగరేణి కార్మికుల నిర్భంధం, ఉద్రిక్తత | singareni workers strike in kothagudem | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుల నిర్భంధం, ఉద్రిక్తత

Jun 21 2017 10:56 AM | Updated on Sep 2 2018 4:19 PM

సింగరేణి సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది.

కొత్తగూడెం: సింగరేణి సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. అధికారులు సమ్మె విచ్ఛిన్నానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక నేతలు సైతం అదేరీతిలో తిప్పి కొడుతున్నారు. నిరసనకు దిగుతున్న కార్మికులను నిర్బంధించి దూర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
 
తాజాగా బుధవారం ఉదయం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(autuc)కు చెందిన ఇద్దరు నాయకులు 5బీ పీవీకేలో షాప్ట్‌ హెడ్‌ మీదకు ఎక్కి దూకుతామని బెదిరిస్తున్నారు. కూసన వీరభద్రం, రఘు అనే యూనియన్‌ నేతలు, సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తున్న అధికారుల తీరుకు నిరసనగా కేజీ టవర్‌ ఎక్కి దూకుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement