సింగరేణి కార్మికుడు ఆత్మహత్య | Singareni worker committed suicide | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుడు ఆత్మహత్య

Oct 7 2015 2:51 PM | Updated on Nov 6 2018 7:56 PM

గోదావరిఖని మండల కేంద్రంలోని విఠల్‌నగర్‌లో చొప్పరి భూమయ్య(57) అనే సింగరేణి ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గోదావరిఖని మండల కేంద్రంలోని విఠల్‌నగర్‌లో చొప్పరి భూమయ్య(57) అనే సింగరేణి ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా భూమయ్య నడుము నొప్పి, బీపీ, అస్తమాతో బాధపడుతున్నాడు. రెండు సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో విధులకు కూడా హాజరు కావడంలేదు.

ఎంతకీ తగ్గకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన భూమయ్య బుధవారం తెల్లవారుజామున వరండాలో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రాధ ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement