నేడు ప్రజ్ఞాపూర్‌కు షర్మిల | Sharmila today to pragnapur | Sakshi
Sakshi News home page

నేడు ప్రజ్ఞాపూర్‌కు షర్మిల

Aug 24 2015 3:51 AM | Updated on May 29 2018 4:23 PM

నేడు ప్రజ్ఞాపూర్‌కు షర్మిల - Sakshi

నేడు ప్రజ్ఞాపూర్‌కు షర్మిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైఎస్ షర్మిల సోమవారం వరంగల్ జి ల్లాకు పరామర్శ యాత్ర నిమిత్తం వెళ్తూ మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఆగనున్నారు

♦ వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు
♦ అభిమానులంతా తరలిరావాలి
♦ వైఎస్‌ఆర్‌సీపీ రాష్ర్ట నేతలు నల్లా, నర్రా పిలుపు
 
  సంగారెడ్డిక్రైం/గజ్వేల్/పటాన్‌చెరు :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వైఎస్ షర్మిల సోమవారం వరంగల్ జి ల్లాకు పరామర్శ యాత్ర నిమిత్తం వెళ్తూ మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఆగనున్నారు. మెదక్ జిల్లా మీదుగా వెళ్లే ఆమె.. గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్, పార్టీ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి తెలిపారు. ఆదివారం వారిక్కడ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.

 ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఏర్పాట్లు
 వైఎస్సార్‌సీపీ నాయకురాలు షర్మిల రాక నేపథ్యంలో ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో ఆమెకు ఘన స్వాగతం పలకడానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మర వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఆయన వైఎస్ విగ్రహం గద్దెకు సున్నం వే యించారు. సోమవారం ఉదయం 9.30 గం టలకు షర్మిల ప్రజ్ఞాపూర్ చేరుకుంటారని వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

 పార్టీ బలోపేతానికి సంఘటిత కృషి
 జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ కార్యకర్తలంతా సం ఘటితంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్, వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి కోరారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని ప ట్టణాలు, మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా మండల, గ్రామస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నామని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement