సాక్షి’ కార్టూనిస్ట్‌ శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు | Sakshi Cartoonist Shankar Gets International Award | Sakshi
Sakshi News home page

సాక్షి’ కార్టూనిస్ట్‌ శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు

Jun 6 2018 2:39 AM | Updated on Aug 20 2018 8:24 PM

Sakshi Cartoonist Shankar Gets International Award

శంకర్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: ‘సాక్షి’కార్టూనిస్ట్‌ పామర్తి శంకర్‌ను మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. ‘ఎండ్‌ ఆఫ్‌ టెర్రరిజం’ పేరిట ఇరాన్‌లో జరిగిన కార్టూన్ల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. ఈ పోటీలో 65 దేశాలకు చెందిన వ్యంగ్య చిత్రకారులు పాల్గొన్నారు. మన దేశం నుంచి 18 మంది తమ ఎంట్రీలను పంపారు. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన గీసిన ఆంగ్‌సాన్‌ సూకీ క్యారికేచర్‌ పురస్కారం గెలుచుకుంది. బహుమతిగా 1,500 డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు జ్ఞాపిక, సర్టిఫికేట్, పబ్లిష్‌డే ఆల్బంను అందజేస్తారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక వరల్డ్‌ ప్రెస్‌ కార్టూన్‌ గ్రాండ్‌ ప్రీ అవార్డు(2015)తోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను శంకర్‌ అందుకున్నారు

Advertisement
 
Advertisement
Advertisement