అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడ్డ ఆర్టీవో ఏజెంట్ | rto agent caught watching blue films | Sakshi
Sakshi News home page

అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడ్డ ఆర్టీవో ఏజెంట్

Jun 12 2015 2:57 PM | Updated on Apr 3 2019 4:43 PM

అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడ్డ ఆర్టీవో ఏజెంట్ - Sakshi

అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడ్డ ఆర్టీవో ఏజెంట్

అశ్లీల చిత్రాలు చూస్తూ ఆర్మూర్‌లో ఆర్టీఓ ఏజెంట్ ఒకరు పోలీసులకు చిక్కాడు.

అశ్లీల చిత్రాలు చూస్తూ ఆర్మూర్‌లో ఆర్టీఓ ఏజెంట్ ఒకరు పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఆర్టీఓ ఏజెంట్‌గా పనిచేసే సుంకే శ్రీనివాస్ గురువారం సాయంత్రం తన కార్యాలయంలో సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తూ, మరొకరికి చూపిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు.

అసభ్యకర చిత్రాలు చూస్తున్న శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతడి మొబైల్‌ను స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఎవరైనా మొబైల్ ఫోన్లలో, కంప్యూటర్లలో అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని చూసినా, పక్కవారికి చూపించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement