వరంగల్ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
జనగామ: వరంగల్ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని జనగాం మండలం పెంబర్తి చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టగా పెద్ద ఎత్తున నగదు బయటపడింది. కారులో తరలిస్తున్న రూ. 9.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.