రౌడీ గ్యాంగ్ వీరంగం..అరెస్ట్ | rowdy sheeters arrested | Sakshi
Sakshi News home page

రౌడీ గ్యాంగ్ వీరంగం..అరెస్ట్

Feb 2 2015 4:22 PM | Updated on Aug 20 2018 4:27 PM

వరంగల్ నగరంలోని కరీమాబాద్ నానమియా తోటలో రౌడీషీటర్‌తో పాటు అతడి అనుచరులు ఓ కుటుంబంపై దాడి చేసి గాయపర్చిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

వరంగల్ : వరంగల్ నగరంలోని కరీమాబాద్ నానమియా తోటలో రౌడీషీటర్‌తో పాటు అతడి అనుచరులు ఓ కుటుంబంపై దాడి చేసి గాయపర్చిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు గట్టికొప్పుల నర్సింహస్వామి, స్వప్న కథనం మేరకు వివరాలు..కరీమాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ పెంచాల అశోక్‌తో పాటు అతడి అనుచరులు పేర్న అనిల్, నరేష్, మరికొందరు నానమియా తోటలో ఉండే గట్టికొప్పుల నర్సింహస్వామి ఇంటిమీదకు ఆదివారం అర్ధరాత్రి వచ్చి అకారణంగా దాడికి దిగారు.

అంతేకాకుండా నర్సింహస్వామి భార్య స్వప్న, ఇంటిపక్కనే ఉన్న అబ్బు అనే యువకుడిపై కూడా దాడిచేసి గాయపర్చారు. ఈ గొడవ వల్ల బస్తీలోని ప్రజలంతా ఒక్కసారిగా నిద్రలేవడంతో పెంచాల అశోక్‌తో పాటు అతడి అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే బాధితులు 100 నంబర్‌కు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు తెలిపారు.  దీంతో మిల్స్‌కాలనీ పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితులు నర్సింహస్వామి, స్వప్న, అబ్బులు సోమవారం రౌడీషీటర్లపై ఫిర్యాదు చేశారు. దీంతో రౌడీషీటర్ పెంచాల అశోక్‌తో పాటు అతడి అనుచరులపై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ సీఐ కె.సత్యనారాయణ తెలిపారు.
(కరీమాబాద్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement