రివాల్వర్తో కాల్పులు జరిపి దోపిడీ.. | Robber open fire, grab cash bag with Rs 1.50 lakh in mahabub nagar district | Sakshi
Sakshi News home page

రివాల్వర్తో కాల్పులు జరిపి దోపిడీ..

Mar 26 2015 1:38 PM | Updated on Oct 8 2018 5:04 PM

రివాల్వర్తో కాల్పులు జరిపి దోపిడీ.. - Sakshi

రివాల్వర్తో కాల్పులు జరిపి దోపిడీ..

మహబూబ్నగర్ జిల్లాలో గురువారం కాల్పులు కలకలం చెలరేగింది. ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) శిరీషను ఓ దుండగుడు రివాల్వర్తో బెదిరించాడు

మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో గురువారం కాల్పులు కలకలం చెలరేగింది. ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న  బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) శిరీషను ఓ దుండగుడు రివాల్వర్తో బెదిరించాడు. అనంతరం గాల్లో రెండు రౌండ్లు జరిగి... ఆమె వద్ద నుంచి లక్షా 50వేలు తీసుకుని పరారయ్యాడు. ఈ సంఘటన వనపర్తి మండలం ఖాసింనగర్లో చేటుచేసుకుంది.

గోపాలపట్నం మండలం జైళ్ల తిరుమలాపురానికి చెందిన బీపీఎం శిరీష మరో యువకుడితో కలసి బైక్‌పై వెళుతుండగా వనపర్తి మండలం కాశీనగర్ దగ్గర ఓ వ్యక్తి రివాల్వర్‌తో బెదిరించి 1.50లక్షల నగదు దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement