రేషన్‌ బియ్యం పట్టివేత | revenue officers seized the ration rice | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Mar 21 2017 12:21 PM | Updated on Sep 5 2017 6:42 AM

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత

లబ్దిదారులకు అందాల్సిన రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు యత్నిస్తున్నారు.

భద్రాద్రి: లబ్దిదారులకు అందాల్సిన రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు యత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన రెవెన్యూ, సివిల్‌ సప్లై అధికారులు పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి రేషన్‌షాపులో డీలర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వచ్చాయి. మంగళవారం అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 400 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement