ప్రచారానికే టీఆర్‌ఎస్‌ నేతల ప్రాధాన్యం | RAVULA Chandrasekhar Reddy fired on trs | Sakshi
Sakshi News home page

ప్రచారానికే టీఆర్‌ఎస్‌ నేతల ప్రాధాన్యం

Apr 6 2017 2:31 AM | Updated on Aug 14 2018 11:02 AM

ప్రచారానికే టీఆర్‌ఎస్‌ నేతల ప్రాధాన్యం - Sakshi

ప్రచారానికే టీఆర్‌ఎస్‌ నేతల ప్రాధాన్యం

సీఎం కేసీఆర్‌ మొదలు కిందిస్థాయి నాయకుల వరకు చేసే పని కంటే ప్రగల్భాలు, ప్రచారానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని..

సాక్షి, హైదరాబాద్‌:  సీఎం కేసీఆర్‌ మొదలు కిందిస్థాయి నాయకుల వరకు చేసే పని కంటే ప్రగల్భాలు, ప్రచారానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. లంచం అడిగిన వారిని చెప్పుతో  కొట్టమని కేటీఆర్‌ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఉద్యోగాల కోసం సీఎంఓలోని వ్యక్తులకు, టీఆర్‌ఎస్‌ పార్టీ వారికీ రూ.40 లక్షలు ఇచ్చినట్లు సతీష్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పిన విషయం అన్ని పత్రికల్లో వచ్చిందని గుర్తుచేశారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బులు లేనిదే ఈ ప్రభుత్వంలో ఏ పని కావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మిషన్‌కాకతీయలో అవినీతి జరగకపోతే అంతమంది అధికారులు ఎందుకు సస్పెండ్‌ అయ్యారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మిషన్‌ కాకతీయలో మట్టి అమ్ముకోవడంపై, ఇసుక దోపిడీపై విచారణ జరిపించగలరా అని ఆయన ప్రశ్నించారు. సీఎం కార్యా లయంలో చోటు చేసుకున్న అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement