రైతుబంధు దేశానికే ఆదర్శం...

Raithu Bandhu Is A Role Model To The Country - Sakshi

వేములవాడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు

మేడిపెల్లి : రైతుబందు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే భూమిలేని వారికి కూడా రైతుబీమా వర్తింపజేసేలా సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని వేములవాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. గురువారం మేడిపెల్లి మండల కేంద్రంతో పాటు కమ్మరిపేట, భీమారం, రంగాపూర్, కొండాపూర్, విలాయతబాద్‌ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య అన్ని గ్రామాలలోని ప్రధాన వీధులలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో రమేశ్‌బాబు పార్టీ జెండాలను ఎగురవేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ రైతులను రాజుగా చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. 

దీని కోసం ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా పంట పెట్టుబడి కింద ఏడాదికి ఏకరానికి రూ.8వేలు, రైతుభీమా కింద చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల ప్రమాద భీమా ఇస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని  మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ,  పార్టీ మండల శాఖ అధ్యక్షులు సుధవేని గంగాధర్‌గౌడ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు నల్ల మహిపాల్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌లు వొద్దినేని హరిచరణ్‌రావు, మిట్టపెల్లి భూమరెడ్డి, కాటిపెల్లి లింగారెడ్డి, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక ప్యాకేజీ
ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక ప్యాకేజీ విషయమై టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు వేములవాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. గురువారం  ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడిపెల్లి  మండలంలోని భీమారంకు వచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబును స్థానిక యువకులు ఎన్‌ఆర్‌ఐ పాలసీపై అడిగారు. ఈ విషయమై రంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక ప్యాకేజీ విషయం చేర్చినట్లు చెప్పారు. మేడిపెల్లి మండల కేంద్రంలోని పీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో గురువారం నాయిబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు నాయీ బ్రాహ్మణులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, నాయీబ్రాహ్మణులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top