బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో పోరాడండి | R krishnaiah on bc reservations | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో పోరాడండి

Mar 10 2018 2:46 AM | Updated on Mar 10 2018 2:46 AM

R krishnaiah on bc reservations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన, మైనార్టీల రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తున్న ఆందోళనను స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అదేవిధంగా 52 శాతం జనాభా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచేలా కృషి చేయాలని కోరారు. శుక్రవారం పలు బీసీ సంఘాలు నిర్వహించిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల పెంపునకు టీఆర్‌ఎస్‌ ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement