పరిటాల గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమైంది? | Ponnam Prabhakar takes on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పరిటాల గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమైంది?

Mar 28 2014 2:41 PM | Updated on Mar 22 2019 5:33 PM

పరిటాల గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమైంది? - Sakshi

పరిటాల గుండు గీయించినప్పుడు పౌరుషం ఏమైంది?

జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ శుక్రవారం నిప్పులు చెరిగారు

జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. సొంత నియోజకవర్గమైన కరీంనగర్లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పొన్నం ఈ సందర్బంగా పవన్ కల్యాణ్కు పలు ప్రశ్నలు సంధించారు. ఓట్లు-సీట్లు కోసం కాదన్నప్పుడు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావంటూ పవన్ను సూటిగా ప్రశ్నించారు.

నీతి,నిజాయితీ గురించి మాట్లాడే నీవు  సినిమా రెమ్యూనరేషన్కు ఇన్కంట్యాక్స్ సరిగ్గా చెల్లిస్తున్నావా అని  అడిగారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చావు...ఆ సమయంలో ఆమెకు చెల్లించిన కోట్లాది రూపాయిలు బ్లాక్ మనీనా లేక వైట్ మనీనా అనే విషయాన్ని పవన్  బహిరంగంగా వెల్లడించాలన్నారు. టీడీపీ నాయకుడు పరిటాల రవి గుండు గీయించిన సమయంలో నీవు ఎందుకు మౌనంగా ఉన్నావంటూ పొన్నం ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని పవన్ కల్యాణ్ను ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.   

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement